ప్రముఖ సినీ నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు | Income Tax Raids On Asian Cinemas Offices | Sakshi
Sakshi News home page

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు

Oct 22 2019 3:54 PM | Updated on Oct 22 2019 4:38 PM

Income Tax Raids On Asian Cinemas Offices - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి.  సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో కలిసి ఏషియన్ సినిమాస్‌ సంస్ద ఏఎంబీ మాల్‌ను ఏర్పాటు చెసిన సంగతి తెలిసిందే. నైజాంలో‌ భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్‌ను కూడా నిర్మించింది. హీరో అల్లు అర్జున్‌తో మరో మల్లీఫ్లెక్స్‌ను కూడా నిర్మించబోతోంది. ప్రస్తుతం ఈ సంస్థ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమాని నిర్మిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement