చూస్తే ప్రేమలో పడిపోతారు! | In fall in love! | Sakshi
Sakshi News home page

చూస్తే ప్రేమలో పడిపోతారు!

Aug 22 2015 11:31 PM | Updated on Sep 3 2017 7:56 AM

చూస్తే ప్రేమలో పడిపోతారు!

చూస్తే ప్రేమలో పడిపోతారు!

ఓ జంట మధ్య చిగురించిన ప్రేమ వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’.

ఓ జంట మధ్య చిగురించిన ప్రేమ వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో టీజర్ ఆవిష్కరించారు.
 
 నాగశౌర్య మాట్లాడుతూ- ‘‘నేను మంచి హీరో అవుతానని రమేష్ వర్మ ఎప్పుడో నమ్మారు. అందుకే నాకోసం మంచి కథ సృష్టించారు. ఈలోగా నేను వేరే సినిమాలతో బిజీ అయిపోయా. అయినా నా కోసం రెండేళ్లు ఆగారు. ఇది కచ్చితంగా హిట్టయ్యే మూవీ. ఇళయరాజాగారితో చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది.
 
 నేను అందగాణ్ణే అనే ఫీలింగ్ కలగచేసిన కెమేరామేన్ శ్యామ్ కె. నాయుడుగారికి నా కృతజ్ఞతలు’’ అని చెప్పారు. ‘‘రమేష్ వర్మ ఓ అద్భుత మైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తేనే ఈ సినిమాతో ఎవరైనా ప్రేమలో పడిపోతారు’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో మల్టీ డైమన్షన్ వాసు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ.

Advertisement
 
Advertisement
Advertisement