అలాంటివి నాకు చేతకాదు | I'm not model to walk on ramp : Tamanna | Sakshi
Sakshi News home page

అలాంటివి నాకు చేతకాదు

Dec 6 2013 11:49 PM | Updated on Sep 2 2017 1:20 AM

అలాంటివి  నాకు చేతకాదు

అలాంటివి నాకు చేతకాదు

‘‘ర్యాంప్‌లపై నడవడానికి నేను మోడల్‌ని కాను.. హీరోయిన్‌ని’’ అంటూ చిర్రుబుర్రులాడారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ మిస్సు కస్సుబుస్సుల వెనుక, ఈ క్యాట్‌వ్యాక్ వెనుక ఓ కథ ఉంది.

 ‘‘ర్యాంప్‌లపై నడవడానికి నేను మోడల్‌ని కాను.. హీరోయిన్‌ని’’ అంటూ చిర్రుబుర్రులాడారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ మిస్సు కస్సుబుస్సుల వెనుక, ఈ క్యాట్‌వ్యాక్ వెనుక ఓ కథ ఉంది. ‘జో రివాజ్’ అనే ఉత్తరాదికి చెందిన వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసి డర్‌గా ఉన్నారు తమన్నా. ఈ కంపెనీ పబ్లిసిటీలో భాగంగా ఓ ఫ్యాషన్ షో నిర్వహించడానికి పూనుకున్నారు సదరు షోరూమ్ యాజమాన్యం. దానికి సంబంధించిన యాడ్ ఫిలింలో తమన్నాను నటింపజేయాలనుకున్నారు. ఈ యాడ్‌ఫిలింలో కంపెనీకి సంబంధించిన చీరలను ధరించి ర్యాంప్‌పై అందంగా తమన్నా క్యాట్‌వాక్ చేయాలి. అయితే... తమన్నా ర్యాంప్‌పై నడవడంలో పూర్తిగా విఫలమయ్యారు. దాంతో అవాక్కవ్వడం సదరు కంపెనీవారి పనైంది.
 
  క్యాట్‌వాక్ చేయడం మిల్కీబ్యూటీకి చేతకాదని అర్థమవ్వడంతో ఎలా నడవాలో తెలియజేయడానికి ఓ ట్రయల్‌వాక్‌ని ఏర్పాటు చేశారు. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఈ సందర్భంలో కోపం రావాల్సింది వాళ్లకైతే, అందుకు భిన్నంగా వాళ్లపై అగ్గిమీద గుగ్గిలమైపోయారట తమన్నా. ‘నేనేమైనా మోడల్‌ని అనుకుంటున్నారా? హీరోయిన్‌ని. ఇలాంటి చెత్త నడకలు నడవడం నాకు చేతకాదు’’ అంటూ వాళ్లపై ఫైర్ అయిపోయారు. దాంతో షాక్ తిన్న యాజమాన్యం ఏదో బుజ్జగించి మూడు రోజుల పాటు తమన్నాకు క్యాట్‌వాక్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారట. ఎట్టకేలకూ కార్యక్రమం చివరి రోజున ఓ మోస్తరుగా నడిచి పర్వాలేదనిపించారట తమన్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement