చూడడానికి... నేను యావరేజ్! | Ileana says i'm looking like a average | Sakshi
Sakshi News home page

చూడడానికి... నేను యావరేజ్!

Feb 19 2016 10:34 PM | Updated on Aug 11 2018 8:27 PM

చూడడానికి... నేను యావరేజ్! - Sakshi

చూడడానికి... నేను యావరేజ్!

‘నేను అందంగా ఉండను’ అని దాదాపు ఎవరూ అనుకోరు. ఏదో యాంగిల్‌లో మనమూ బాగుంటామనే ఫీలింగ్‌తోనే ఉంటారు.

‘నేను అందంగా ఉండను’ అని దాదాపు ఎవరూ అనుకోరు. ఏదో యాంగిల్‌లో మనమూ బాగుంటామనే ఫీలింగ్‌తోనే ఉంటారు. ఈ కేటగిరీని పక్కన పెడితే... అందంగా ఉండి కూడా లేమనుకునేవాళ్లూ ఉంటారు. ఇలియానా ఈ కోవకే చెందుతారు. చిన్నప్పుడు బొద్దుగా ఉండేదాన్ననీ, అందరూ ఏడిపించేవారనీ ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. అలాగే, సినిమా హీరోయిన్ అవుతానని కూడా అనుకోలేదని అన్నారు. ఇటీవల ఓ సందర్భంలో తన అందం గురించి ఇలియానా మాట్లాడుతూ - ‘‘నేను ఆకర్షణీయంగా ఉంటానని అనను.

అలాగని ఆకర్షణీయంగా లేనని కూడా అనను. యావరేజ్‌గా ఉంటాను. తొలి చూపులోనే ఇతరుల దృష్టిని ఆకట్టుకునేంత అందంగా ఉండనని నా ఫీలింగ్. ఉదాహరణ చెప్పాలంటే.. కుర్చీలను, టేబుల్ ల్యాంప్‌ను చూసి, మనం ఆకర్షితులం కాదు కదా! నేను కూడా వాటిలానే! ఎవర్నీ ఎట్రాక్ట్ చేయలేను’’ అన్నారు. ఈ మాటలను ఇలియానా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది చదివిన ఆమె ఫాలోయర్స్ ‘నువ్వు యావరేజ్ కాదు.. సూపర్’, ‘నువ్వు చాలా చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటావు’, ‘మొదటిసారి నిన్ను చూడగానే ఆకట్టుకో గలుగుతావ్’. ‘నీ అందం ఎవరినైనా అమాంతం పడేస్తుంది’ అని కామెంట్స్ పెట్టారు. ఇవి చదువుకుని ఇలియానా ఆనందపడి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement