రీచార్జ్ అయిన ఇళయరాజా | Ilayaraja's health Right Now | Sakshi
Sakshi News home page

రీచార్జ్ అయిన ఇళయరాజా

Jan 7 2014 9:58 AM | Updated on Sep 2 2017 2:22 AM

ఇళయరాజాను సత్కరిస్తున్న రాజరాజ చోళన్ చిత్ర యూనిట్

ఇళయరాజాను సత్కరిస్తున్న రాజరాజ చోళన్ చిత్ర యూనిట్

సంగీతానికే రారాజుగా పేరు, ప్రఖ్యాతులు పొందిన ఇళయరాజా ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యూరు.

సంగీతానికే రారాజుగా పేరు, ప్రఖ్యాతులు పొందిన ఇళయరాజా ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యూరు. గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఇళయరాజా ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగొచ్చారు. అనారోగ్యం కారణంగా మలేషియాలో నిర్వహించిన సంగీత కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడి అభిమానులను అలరించారు. నూతన సంవత్సరంలో ఇళయరాజా తన వృత్తి పరంగా రీచార్జ్ అయ్యారు.

 

గీత రచయిత స్నేహన్ హీరోగా నటిస్తున్న రాజరాజ చోళనిన్ పోర్ వాల్ చిత్రం కోసం ఆయన నూతనోత్సాహంతో బాణీలందించారు. ఈ కార్యక్రమం ఆదివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ థియేటర్‌లో జరిగింది. సోమవారం ఈ పాట రికార్డింగ్ జరిగింది. నూతన సంవత్సరంలో తొలిసారిగా ఇళయరాజా తన చిత్రానికి  సంగీతాన్ని అందించడం సంతోషంగా భావిస్తున్నారు రాజరాజ చోళనిన్ పోర్‌వాల్ చిత్ర యూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement