అవార్డుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు: ఇళయరాజా | Music Director Ilaiyaraaja Concert Over His 50 Year Musical Legacy | Sakshi
Sakshi News home page

Ilaiyaraaja: 50 ఏళ్ల సంగీత ప్రస్థానం.. ఇళయరాజా రెండు రోజుల కచేరి

Jun 1 2026 7:54 AM | Updated on Jun 1 2026 7:26 PM

Music Director Ilaiyaraaja Concert Over His 50 Year Musical Legacy

సంగీత రంగంలో రారాజుగా వెలుగుతున్న సంగీతదర్శకుడు ఇళయరాజా. తమిళం, తెలుగు మొదలగు భాషల్లో తన ఖ్యాతిని చాటిన ఈయన సంగీత పయనం 50 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం, ఆదివారం.. రెండు రోజులపాటు చైన్నెలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో సంగీత కచేరి బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళయరాజా మాట్లాడుతూ ‘‘నేను అవార్డుల కోసం వేచి చూసే వ్యక్తిని కాదు. నేను నడిచినా, మాట్లాడినా సాధననే’’ అని ఇళయరాజా పేర్కొన్నారు. 

సంగీత కచేరి
ఈ వేదికపై తన ఇద్దరు మనవళ్ల మధ్య కూర్చుని ఇళయరాజా సంతోషంగా కనిపించారు. ముందుగా విదేశీ సంగీత కళాకారులు సింపోనిని వాయించారు. అనంతరం ఇళయరాజా గతంలో సంగీతం అందించిన పాటలను శ్రోతల కోసం వాయించారు. ఇళయరాజా 'పుదియ వార్పుగళ్‌' చిత్రంలోని 'ఇదయం పోగుదే..' అనే పాటను రూపొందించిన విధానం గురించి, దానికి వాడిన సింపోని గురించి వివరించారు. 

అతిథులు
ఈ కార్యక్రమంలో ఇళయరాజా వారసులు యువన్‌ శంకర్‌రాజా, కార్తీక్‌రాజాలతో పాటు దర్శకుడు మిష్కిన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌, మారి సెల్వరాజ్‌, విఘ్నేశ్‌ శివన్‌, నటుడు సిద్ధార్ధ్‌, పార్తీబన్‌, సంతానభారతి, ముఖ్యమంత్రి విజయ్‌ తల్లి శోభ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది సంగీత ప్రియులు ఆనందంతో తరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement