ప్రతిదీ న్యూసే! | Sakshi
Sakshi News home page

ప్రతిదీ న్యూసే!

Published Sat, Sep 1 2018 2:38 AM

idam jagat movie released on september 28 - Sakshi

మనిషి చావు, జ్ఞాపకం, ప్రేమ, స్నేహం... ఇలా చేయాలనుకుంటే ప్రతిదీ న్యూసే. కానీ ఆ న్యూస్‌ను క్యాష్‌ చేసుకోవాలనుకుంటాడు ఓ యువకుడు. అవసరమైతే న్యూస్‌ను క్రియేట్‌ చేసేందుకు సిద్ధం అవుతాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో రూపొందిన సినిమా  ‘ఇదం జగత్‌’. అనిల్‌ శ్రీ కంఠ దర్శకత్వంలో సుమంత్‌ కథానాయకుడిగా నటించారు. అంజు కురియన్‌ కథానాయిక. శివాజీ రాజా, సత్య,  ఆదిత్యా మీనన్‌ కీలక పాత్రల్లో నటించారు.

జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఇటీవల రిలీజ్‌ చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో సుమంత్‌ కనిపిస్తారు. ఆయన పాత్ర సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. కథకు ‘ఇదం జగత్‌’ టైటిల్‌ బాగా యాప్ట్‌ అవుతుంది. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల.

 
Advertisement
 
Advertisement