నో మోర్‌ గ్యాప్‌! | I will not take a gap for the next four years...Sridevi | Sakshi
Sakshi News home page

నో మోర్‌ గ్యాప్‌!

Jul 10 2017 12:04 AM | Updated on Sep 5 2017 3:38 PM

నో మోర్‌ గ్యాప్‌!

నో మోర్‌ గ్యాప్‌!

‘మామ్‌’ సినిమాకు, అందులో నటనకు మంచి పేరొచ్చిందనే సంతోషంలో ఉన్న శ్రీదేవికి ఇప్పుడు తరచూ ఓ ప్రశ్న ఎదురవుతోంది.

‘మామ్‌’ సినిమాకు, అందులో నటనకు మంచి పేరొచ్చిందనే సంతోషంలో ఉన్న శ్రీదేవికి ఇప్పుడు తరచూ ఓ ప్రశ్న ఎదురవుతోంది. ‘నెక్స్‌›్ట ఏంటి? నెక్స్‌›్ట సిన్మా ఎప్పుడొస్తుంది?’ శ్రీదేవి ఎక్కడికి వెళ్లినా ఈ ప్రశ్నలు తప్పడం లేదు. ఎందుకంటే... ‘మామ్‌’కు ముందు సుమారు ఐదేళ్లు శ్రీదేవి ఫుల్‌లెంగ్త్‌ లీడ్‌రోల్‌ చేయలేదు.

‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’తో రీ–ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని ‘మామ్‌’ చేశారు. అందువల్ల, ఆ ప్రశ్నల్లో మళ్లీ ఎన్నేళ్లు గ్యాప్‌ తీసుకుంటారు? అనే అర్థం వస్తుండడంతో ‘‘మళ్లీ నాలుగైదేళ్లు గ్యాప్‌ మాత్రం తీసుకోను’’ అని శ్రీదేవి స్పష్టం చేశారు. బీ–టౌన్‌ జనాలయితే... శ్రీదేవి నెక్స్‌›్ట సినిమాకు ఆల్రెడీ స్క్రిప్ట్‌ మొదలైందని అంటున్నారు. ఒకప్పటి క్లాసిక్‌ ‘మిస్టర్‌ ఇండియా’కు సీక్వెల్‌గా ‘మిస్టర్‌ ఇండియా–2’ తీయ డానికి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement