అజ్ఞాతవాసిలో అందుకే నటించలేదు : సునీల్‌ | i will do comedy charectors also : sunil | Sakshi
Sakshi News home page

అజ్ఞాతవాసిలో అందుకే నటించలేదు : సునీల్‌

Dec 28 2017 7:50 PM | Updated on Apr 4 2019 4:46 PM

i will do comedy charectors also : sunil  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పవన్‌ కళ్యాణ్‌ త్రివిక్రమ్‌ల సెల్యులాయిడ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించకపోవడానికిగల కారణాలు ఏమిటో ప్రముఖ తెలుగు హీరో సునీల్‌ చెప్పారు. హాస్య నటుడిగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన ఆయన సొంతకాళ్లపై నిలబడి హీరోగా రాణిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘టూ కంట్రీస్‌’ చిత్రం శుక్రవారం(డిసెంబర్‌ 29) విడుదల కాబోతోంది. ఎన్‌.శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మనీషారాజ్‌ కథానాయికగా నటించింది.

దీంతో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ అజ్ఞాతవాసి చిత్రంలో నటించకపోవడానికి కారణాలు చెప్పారు. తమ మధ్య చర్చలు జరిగాయని, అప్పటికే స్క్రిప్ట్ పూర్తయిందని, ఆ సినిమాలో తన పాత్ర ఆశించినట్లుగా తీర్చిదిద్దడం సాధ్యం కాలేదన్నారు. అందుకే నటించలేదని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి హాస్యనటుడిగా కూడా చేస్తానని, అలాగే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తానని స్పష్టం చేశారు. ‘త్రివిక్రమ్‌ ఇప్పుడు వరల్డ్‌ కప్‌ ఆడుతున్నాడు. మనం అప్పట్లో గల్లీ క్రికెట్‌ ఆడాం కదా, మళ్లీ ఆడుదాం రా అని నేను పిలవకూడదు. త్రివిక్రమ్‌ మార్కెట్‌ అంతకంతకూ పెరుగుతోంది. త్రివిక్రమ్‌ సినిమా ఎంత ఆలస్యమైతే అంత మేలు’అని సునీల్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement