నేను ఐశ్వర్యారాయ్‌లా నటించలేను | I can not act like aishwaryarai | Sakshi
Sakshi News home page

నేను ఐశ్వర్యారాయ్‌లా నటించలేను

Nov 25 2016 2:24 AM | Updated on Oct 4 2018 7:55 PM

నేను ఐశ్వర్యారాయ్‌లా నటించలేను - Sakshi

నేను ఐశ్వర్యారాయ్‌లా నటించలేను

తాను ఐశ్వర్యారాయ్‌లా నటించలేను అంటున్నారు నటి జెనీలియా

తాను ఐశ్వర్యారాయ్‌లా నటించలేను అంటున్నారు నటి జెనీలియా. దక్షిణాదిలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈ ఉత్తరాది భామ హింది నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను లవ్వాడి, పెళ్లాడిన తరువాత కొంత కాలం నటనకు దూరంగా ఉన్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన జెనీలియా మళ్లీ నటించడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే హిందీ చిత్రం ఫోర్స్-2లో గెస్ట్‌గా మెరిశారు కూడా. ఇక వార్తల్లో ఉండడానికి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇక కార్యక్రమంలో పాల్గొన్న జెనీలియా తాను మునుపటి కన్నా చాలా తెలివి మీరానని తెలిపారు. అనుభవం కూడా గడించానని చెప్పారు. చాలా మంది హీరోరుున్లు పెళ్లి తరువాత పిల్లలను కనడానికి సంకోచిస్తున్నారన్నారు. కొందరైతే గర్భం ధరించడం ఇష్టం లేక విడాకులు తీసుకుంటున్నారన్నారు.

నిజానికి మాతృత్వంతో చాలా పరిణితి కలుగుతుందని, నటనలోనూ మరింత మెరుగ్గా నటించగలుగుతాయమని అన్నారు.నటి ఐశ్వర్యారాయ్‌నే తీసుకుంటే తను తల్లి అరుున తరువాత మరింత పరిణితితో నటిస్తున్నారని పేర్కొన్నారు.అరుుతే ఆమె ఇటీవల నటించిన చిత్రంలో హీరో రణ్‌బీర్‌కపూర్‌తో ఘాటైన లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి పెద్ద చర్చకే దారి తీశారన్నారు. తాను అలా నటించలేనని అన్నారు. మొత్తం మీద నటి ఐశ్వర్యారాయ్ చుంబనాల దృశ్యాలను సాకుగా చూపి నటి జెనీలియా తాను ప్రచారం పొందాలని చూస్తున్నారా? అన్న సందేహం కలుగుతోంది కదూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement