'మేమిద్దరం మంచి స్నేహితులేమేమీ కాదు' | I and Shah Rukh are just colleagues, not good friends, Ajay Devgn | Sakshi
Sakshi News home page

'మేమిద్దరం మంచి స్నేహితులేమేమీ కాదు'

Jul 14 2015 7:19 PM | Updated on Aug 17 2018 2:27 PM

'మేమిద్దరం మంచి స్నేహితులేమేమీ కాదు' - Sakshi

'మేమిద్దరం మంచి స్నేహితులేమేమీ కాదు'

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో రాసుకుని పూసుకుని తిరిగే స్నేహం ఏమీ లేదంటున్నాడు సహచర నటుడు అజయ్ దేవగణ్.

ముంబై: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో రాసుకుని పూసుకుని తిరిగే స్నేహం ఏమీ లేదంటున్నాడు సహచర నటుడు అజయ్ దేవగణ్. తామిద్దర మధ్య ఉన్నది కేవలం నటనపరంగా ఉన్న సాన్నిహిత్యమే తప్పా.. ఒక మంచి ఫ్రెండ్ షిప్ అయితే ఏమీ లేదని అజయ్ స్పష్టం చేశాడు. వీరిద్దరూ నటనలో పోటీ పడి చేయడమే కాకుండా..  నిజ జీవితంలో కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఉందన్న వార్తలను అజయ్ ఖండించాడు. ఇటీవల బల్గేరియాలో షారుక్-అజయ్ లు కలిసి ఒకే డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని విందు స్వీకరించిన అనంతరం వారి స్నేహాన్ని బలపరస్తూ వార్తలు వచ్చాయి.

 

దీనిపై అజయ్ స్పందిస్తూ.. ' మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయితే కాదు. షారుక్ నా సహచర నటుడు మాత్రమే. మేము తరుచు కలిసి షేర్ చేసుకున్న అంశాలు కూడా ఏమీ లేవు. అలాగని మా ఇద్దరి మధ్య ఏ విధమైన వార్ కూడా లేదు 'అని తెలిపాడు.  ప్రస్తుతం అజయ్ మళయాళం సూపర్ హిట్ మూవీ 'దృశ్యం' రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 31 వ తేదీన విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement