పెళ్లైనా పద్ధతి మారలేదు: కరీనా
పెళ్లైనా నటన విషయంలో తన వైఖరి మారలేదంటోంది కరీనా కపూర్. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్ అయినా సంకోచం లేకుండా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేసింది.
పెళ్లైనా నటన విషయంలో తన వైఖరి మారలేదంటోంది కరీనా కపూర్. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్ అయినా సంకోచం లేకుండా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. పెళ్లయితే మాత్రం హాట్ సన్నివేశాల్లో నటించకూడదా అని గడుసుగా ప్రశ్నించింది. ప్రేమ లేదా పెళ్లితో కథానాయికల కెరీర్కు ఫుల్స్టాఫ్ పడినట్టు ఎందుకనుకుంటారో అర్థంకాదని ఓ ఇంటర్వ్యూలో వాపోయింది.
ఓంకారా సినిమాలో అజయ్ దేవగన్తో లిప్ లాక్ నటించిన కరీనా తాజాగా విడుదలయిన 'సత్యాగ్రహ'లోనూ అజయ్తో హాట్ సన్నివేశాల్లో నటించింది. అయితే ఈ సన్నివేశాల్లో నటించేందుకు మొదట కరీనా నిరాకరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బేబొ తోసిపుచ్చింది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎటువంటి సన్నివేశంలో నటించేందుకు అభ్యంతరం లేదని చెప్పింది.
సత్యాగ్రహ రొమాంటిక్ సినిమా కాదని, కథలో భాగంగానే ఇందులో చుంబన దృశ్యాలు పెట్టారని తెలిపింది. అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్యుడు సాగించిన పోరాటం నేపథ్యంగా ఈ సినిమాతెరకెక్కిందని వివరించారు. అయితే తన భర్త సైఫ్ అలీఖాన్ ఈ సినిమా చూడలేదని చెప్పింది. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత సైఫ్-కరీనా గతేడాది అక్టోబర్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.


