నేను బికినీ వేయడంలేదు : సమంత

నేను బికినీ వేయడంలేదు : సమంత

సమంతకు కోపం వచ్చింది. ‘‘నా సినిమాల్లో నా పాత్రలు చూసి కూడా నా గురించి ఇలాంటి గాసిప్పులు ఎలా పుట్టించగ లుగుతున్నారు?’’ అని మీడియాపై నిప్పులు కక్కింది. ఇంతకీ ఈ చెన్నయ్ చందమామకు అంత కోపాన్ని తెచ్చేపని మీడియావారు ఏంచేశారు? అనుకుంటున్నారా! విషయం ఏంటంటే... ఎన్టీఆర్ ‘రభస’చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

ఈ సినిమాలో ఆమె బికినీ వేయనుందని, కథానుగుణంగా ఆ సన్నివేశం ఉండటంతో బికినీలో కనిపించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలే సమంత కోపానికి కారణం. దాంతో వాటిని ఖండిస్తూ ట్విట్టర్ ద్వారా తన మనోగతాన్ని పోస్ట్ చేశారు సమంత.

 

‘‘నాపై జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. నేను బికినీ వేయడం శుద్ధ అబద్ధం. నేనేంటో, ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలేంటో తెలిసి కూడా నాపై ఇలాంటివి పుట్టించడం నిజంగా దారుణం’’ అని ట్విట్టర్ ద్వారా బాధను వ్యక్తం చేశారు సమంత.

 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top