breaking news
N. T. Rama Rao Jr.
-
ప్రశాంత్ నీల్ బర్త్ డే.. సెలబ్రేషన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్!
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొలిసారి ఎన్టీఆర్-నీల్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌కు కేక్ తినిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ బర్త్ డే కావడంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ తెలిపారు. మీ మాటల కంటే మీ విజన్ సౌండ్ గట్టిగా వినిపిస్తుందని కొనియాడారు. స్క్రీన్‌పై మీ ఫైర్ కనిపిస్తుందని ప్రశంంచారు.(ఇది చదవండి: బెంగళూరు గెలుపు.. పూనకంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్)అయితే ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ ఆనందం వ్యక్తం చేశారు. బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్ వీక్షించిన ఆయన ఒక్కసారిగా చిందులు వేస్తూ కనిపించారు. ఈ సాలా కప్ నమ్దే అంటూ సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. Happy Birthday Prashanth!Your vision speaks louder than words. Here’s to more fire on screen… pic.twitter.com/fv2bxGaEMJ— Jr NTR (@tarak9999) June 4, 2025 -
ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. బాహుబలి-2ను వెనక్కి నెట్టి..!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం జపాన్‌లోనూ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా బాహుబలి రికార్డును అధిగమించింది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా అవతరించింది. అత్యంత వేగంగా 300 మిలియన్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న బాహుబలి-2 ను వెనక్కినెట్టింది. (చదవండి: RRR Collections in Japan: జపాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్-2ను దాటే ఛాన్స్?) జపాన్ విడుదలైన 34 రోజుల్లోనే ఆ దేశ కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు.. అంటే దాదాపు రూ.17.9 కోట్లు వసూలు చేసింది. 24 ఏళ్ల క్రితం విడుదలైన రజనీకాంత్ చిత్రం ముత్తు మాత్రమే రూ.23.5 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా మొదటిస్థానంలో ఉంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ నటించారు. -
సినిమా రివ్యూ: రభస
ప్లస్ పాయింట్స్: జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ సమంత, ప్రణీత గ్లామర్, బ్రహ్మానందం కామెడీ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, పేలవమైన కథనం మితిమీరిన ఫైట్స్ ఓ అమ్మాయి ప్రేమను కాపాడే పయత్నంలో మరో అమ్మాయి పెళ్లి ఆగిపోవడానికి కారణమవుతాడు కార్తీక్(జూనియర్ ఎన్టీఆర్). తన తండ్రి(నాజర్) అవమానించిన తన మేనమామ ధనుంజయ్ (షియాజీ షిండే) బుద్ది చెప్పి, తన తల్లి కోరిక మేరకు తన మరదలు చిట్టి అలియాస్ ఇందు(సమంత)ను పెళ్లి చేసుకోవాలని హైదరాబాద్ చేరుకుంటారు. తన మరదలు అని తెలియకపోవడంతో మొదటి కలయికలోనే ఇందు,కార్తీక్ ల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. తన మరదలిని ప్రేమలోకి దించే ప్రయత్నంలో భాగ్యం(ప్రణితి)ను ఇందుగా భావించి ప్రేమలోకి దింపుతాడు. కార్తీక్ చెడ్డవాడు అనే భావనలో ఉన్న ఇందు..వారిద్దరి విడగొడుతుంది. భాగ్యంతో ప్రేమను విడగొట్టిన ఇందు అప్పటికే తనకు తెలియని వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్న తన తండ్రి ప్రయత్నాలకు దూరంగా పారిపోవడానికి కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్టు నాటకం ఆడుతుంది. కథ ఇలా నడుస్తుండగా.. పెద్దిరెడ్డి (జయప్రకాశ్) ఓబుల్ రెడ్డి (అజయ్)ల గ్యాంగ్ కార్తీక్ కోసం వెదుకుతుంటారు. ఓదశలో కార్తీక్, ఇందులు పెద్దిరెడ్డి ఇంట్లోకే చేరుతారు. తనను వెతుకున్న విలన్ల ఇంటికి చేరిన కార్తీక్ ఏం చేశాడు. ఇందు తన మరదలే అని తెలుసుకున్నాడా? తెలియని వ్యక్తితో ప్రేమలో పడిన ఇందు తన ప్రేమికుడిని కలుసుకుందా? పెద్దిరెడ్డి, ఓబుల్ రెడ్డిలు కార్తీక్ ను ఎందుకు వెతుకుతున్నారు? అయితే ఇందు తన మరదలు అని తెలుసుకుంటాడా? తన కారణంగా ఓ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని తెలుసుకున్న కార్తీక్ ఏం చేశాడు? తన మామ ధనుంజయ్ ను ఎలా కన్విన్స్ చేసి ఇందును పెళ్లి చేసుకున్నాడా? అనే పలు ప్రశ్నలకు సమాధానమే 'రభస' ప్రేమికుడిగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఓ వ్యక్తిగా, తన తల్లిని మాటను తీర్చే కోడుకుగా, పగ ప్రతీకారంతో రగిలిపోతున్న రెండు ఫ్యాక్షన్ల కుటుంబాలను కలిపే మనసున్న మనిషిగా, తన మేనమామకు తగిన గుణపాఠం నేర్పే అల్లుడిగా.. పలు విభిన్న షేడ్స్ ఉన్న కార్తీక్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశాడు. గత కొద్దికాలంగా సరైన హిట్ లేని.. జూనియర్ ఎన్టీఆర్.. ప్రయోగాలకు చోటివ్వకుండా చాలా సేఫ్ గా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎప్పటిలానే ఫైట్స్, డ్యాన్స్, అభినయం, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. సమంత పాత్ర ప్రధానంగా గ్లామర్ కే పరిమితమైన, కీలక సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. ప్రణీత రెండో హీరోయిన్ గా కనిపించి.. కథానుగుణంగా కనిపించి మాయమవుతుంది. ప్రణీత కెరీర్ కు పెద్గగా ప్లస్ అవుతుందని చెప్పడం కష్టమే. రాజు పాత్రలో కనిపించిన బ్రహ్మనందం రోటిన్ కారెక్టర్ అయినప్పటికి.. ద్వితీయార్ధంలో సినిమా భారాన్ని తనపైనే వేసుకున్నాడు. ఫైట్స్ తో విసిగించే సమయంలో రాజుగా ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులకు బ్రహ్మనందం కొంత రిలీఫ్ కలిగించాడు. జయప్రకాశ్, నాగినీడు, అజయ్, షియాజీ షిండే, నాజర్, జయసుధలు తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు. సాంకేతిక నిపుణులు పనితీరు: సాంకేతిక విభాగంలో ముఖ్యంగా శ్యామ్ కే నాయుడును అందించిన ఫోటోగ్రఫి బాగుంది. లోకేషన్లు ఆందంగా చిత్రీకరించి.. రభసకు అదనపు ఆకర్షణగా మారారు. ఈ చిత్ర నిడివి సుమారు 2 గంటల 40 నిమిషాలకు పైనే ఉంది. ఎడిటింగ్ విభాగంలో కోటగిరి వెంకటేశ్వరరావు మరింత పదను పెట్టాల్సిందే. ఓ రెండు పాటలు మినహా తమన్ ప్రభావవంతమైన సంగీతాన్ని అందించలేదనే చెప్పవచ్చు. ఎమోషన్ సీన్స్ లో నేపథ్యం సంగీతంగా అంతగా ఆకట్టుకునే విధంగా లేదనిపిస్తోంది. 'కందిరీగ' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంతోష్ శ్రీనివాస్ రభస కథ, కథనాన్ని చాలా కాంప్లికేటెడ్ పంథాలోనే కొనసాగించాడు. అనేక ట్విస్టులు, గందరగోళంగా ఉండే కథనంతో ప్రేక్షకుడిని అక్కడక్కడా కన్ ఫ్యూజ్ చేస్తుంది. కథాగమనంలో అనేక మలుపులు సహజంగా ఉన్నట్టు ఎక్కడా అనిపించదు. కేవలం కమర్షియల్ ఆంశాలను బేరిజు వేసుకుని కథ, కథనంపై దృష్టిపెట్టారనేది సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. అయితే తొలిభాగంలో ఓపెన్ చేసిన ట్విస్టులకు ద్వితీయార్ధంలో క్లోజ్ చేసిన తీరు, విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. చిత్ర ద్వితీయార్ధంలో తీసుకున్న కొన్ని జాగ్రత్తలు దర్శకుడి ప్రతిభకు అద్దపడుతుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా ఎలాంటి ప్రయోగాలకు చోటివ్వకుండా టాలీవుడ్ సక్సెస్ ఫార్ములాతో కథను పట్టాలెక్కించి.. సేఫ్ గా గమ్యాన్ని చేర్చేందుకు చేసిన ప్రయత్నం కొంత వర్కవుట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ఉర్రూతలూగించే చిత్రంగా కాకుండా.. ఓ రకమైన సంతృప్తిని కలిగించే చిత్రంగా 'రభస' రూపొందింది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరణపైనే రభస సక్సెస్, కమర్షియల్ గా ఏరేంజ్ లో వర్కవుట్ అయిందనే అంశాలు అధారపడి ఉన్నాయి. -రాజబాబు అనుముల -
నేను బికినీ వేయడంలేదు : సమంత
సమంతకు కోపం వచ్చింది. ‘‘నా సినిమాల్లో నా పాత్రలు చూసి కూడా నా గురించి ఇలాంటి గాసిప్పులు ఎలా పుట్టించగ లుగుతున్నారు?’’ అని మీడియాపై నిప్పులు కక్కింది. ఇంతకీ ఈ చెన్నయ్ చందమామకు అంత కోపాన్ని తెచ్చేపని మీడియావారు ఏంచేశారు? అనుకుంటున్నారా! విషయం ఏంటంటే... ఎన్టీఆర్ ‘రభస’చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె బికినీ వేయనుందని, కథానుగుణంగా ఆ సన్నివేశం ఉండటంతో బికినీలో కనిపించడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలే సమంత కోపానికి కారణం. దాంతో వాటిని ఖండిస్తూ ట్విట్టర్ ద్వారా తన మనోగతాన్ని పోస్ట్ చేశారు సమంత. ‘‘నాపై జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. నేను బికినీ వేయడం శుద్ధ అబద్ధం. నేనేంటో, ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలేంటో తెలిసి కూడా నాపై ఇలాంటివి పుట్టించడం నిజంగా దారుణం’’ అని ట్విట్టర్ ద్వారా బాధను వ్యక్తం చేశారు సమంత.