ప్రశాంత్ నీల్ బర్త్ డే.. సెలబ్రేషన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్! | Jr Ntr Celebrates Director Prashanth Neel Birhday at Movie Sets | Sakshi
Sakshi News home page

Prashanth Neel Birhday: ప్రశాంత్ నీల్ బర్త్ డే.. ఎన్టీఆర్‌తో కలిసి సెలబ్రేషన్స్‌!

Jun 4 2025 1:42 PM | Updated on Jun 4 2025 1:43 PM

Jr Ntr Celebrates Director Prashanth Neel Birhday at Movie Sets

కేజీఎఫ్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్‌ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొలిసారి ఎన్టీఆర్‌-నీల్‌ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‍ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ బర్త్ ‍డే వేడుకలను సెలబ్రేట్‌ చేసుకున్నారు. కేక్ కట్‌ చేసిన ప్రశాంత్ నీల్‌.. ఎన్టీఆర్‌కు కేక్ తినిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ బర్త్‌ డే కావడంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ తెలిపారు.  మీ మాటల కంటే మీ విజన్‌ సౌండ్ గట్టిగా వినిపిస్తుందని కొనియాడారు. స్క్రీన్‌పై మీ ఫైర్‌ కనిపిస్తుందని ప్రశంంచారు.

(ఇది చదవండి: బెంగళూరు గెలుపు.. పూనకంతో ఊగిపోయిన స్టార్‌ డైరెక్టర్)

అయితే ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించడంతో ప్రశాంత్‌ నీల్‌ ఆనందం వ్యక్తం చేశారు. బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్‌ వీక్షించిన ఆయన ఒక్కసారిగా చిందులు వేస్తూ కనిపించారు. ఈ సాలా కప్ నమ్దే అంటూ సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ  వైరలవుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement