అందుకే... బాలకృష్ణ పేరు ఉంచేశాం! | i am big fun of Nandamuri Balakrishna says Kola Balakrishna | Sakshi
Sakshi News home page

అందుకే... బాలకృష్ణ పేరు ఉంచేశాం!

Mar 8 2016 11:19 PM | Updated on Aug 29 2018 1:59 PM

అందుకే... బాలకృష్ణ పేరు ఉంచేశాం! - Sakshi

అందుకే... బాలకృష్ణ పేరు ఉంచేశాం!

మా అబ్బాయి స్క్రీన్ నేమ్ క్రిష్ అని పెడదామనుకున్నా. డెరైక్టర్ శ్రీ రాఘవగారికి నచ్చలేదు. మా అబ్బాయి నందమూరి బాలకృష్ణగారికి పెద్ద ఫ్యాన్.

- నిర్మాత కోలా భాస్కర్
 ‘‘మా అబ్బాయి స్క్రీన్ నేమ్ క్రిష్ అని పెడదామనుకున్నా. డెరైక్టర్ శ్రీ రాఘవగారికి నచ్చలేదు. మా అబ్బాయి నందమూరి బాలకృష్ణగారికి పెద్ద ఫ్యాన్. వాడికి ఆయన పేరు అంటే ఇష్టం కావడంతో కోలా బాలకృష్ణ అనే ఉంచేశాం. ఖర్చుకు వెనకాడకుండా సినిమా తెరకెక్కించడానికి పార్థసారథి గారు అందించిన సహకారం మరువలేనిది’’ అని చిత్ర నిర్మాత కోలా భాస్కర్ తెలిపారు.
 
 బాలకృష్ణ కోలా, వామిక జంటగా బీప్‌టోన్ స్టూడియోస్, శ్రీకామాక్షీ మల్టీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ‘గీతాంజలి’ శ్రీరాఘవ దర్శకత్వంలో కోలా భాస్కర్, కంచర్ల పార్థసారథి నిర్మించిన చిత్రం‘నన్ను వదలి నీవు పోలేవులే’. అమృత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హీరోయిన్ వేద పాటల సీడీ విడుదల చేసి చిత్ర కథానాయిక వామికకు అందించారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ- ‘‘కోలా భాస్కర్‌గారు ఎడిటర్‌గా అందరికీ తెలుసు. తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. లవ్ సబ్జెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇక్కడా విజయం సాధించాలి’’ అన్నారు.
 
  ‘‘‘7జి బృందావన్ కాలనీ’కి దర్శకత్వం వహించిన శ్రీరాఘవ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఆ చిత్రం లాగానే ‘నన్ను వదలి నీవు పోలేవులే’ మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత సురేశ్ కొండేటి అన్నారు. చిత్ర దర్శకుడు ‘గీతాంజలి’ శ్రీ రాఘవ, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, నిర్మాతలు సీవీ రెడ్డి, బీఏ రాజు, హీరోయిన్ పూనమ్ కౌర్, పాటల రచయిత అనంత శ్రీరాం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement