మళ్లీ దెబ్బలు తిన్న నటుడు

Huccha Venkat Thrashed Again Over Breaking Car Mirrors - Sakshi

సాక్షి, బెంగళూరు : బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, కన్నడ నటుడు హుచ్చ వెంకట్‌ తన వింత చేష్టలతో మరోసారి దెబ్బలు తిన్నాడు. రెండు రోజుల క్రితం కొడగులో తన వైపు ఎందుకు వింతగా చూస్తున్నారంటూ ఇతరుల కారు అద్దాలను వెంకట్‌ ధ్వంసం చేశాడు. దీంతో స్థానిక యువకులు అతడిని చితక్కొట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మండ్య నగరానికి వచ్చి ఒక హోటల్లో దిగిన హుచ్చ వెంకట్‌ ఆదివారం ఉదయం మరోసారి పిచ్చిగా ప్రవర్తించాడు. హోటల్‌ ముందు నిలిపి ఉన్న గుర్తు తెలియని కారు అద్దాలను పగులగొట్టాడు. దాంతో అక్కడ ఉన్న కారు యజమాని అయిన యువకుడు హుచ్చ వెంకట్‌ మీద దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వెంకట్‌ను తీసుకొని వెళ్లారు. కొడగులో హుచ్చను చితకబాదిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

కాగా నటుడిగా గుర్తింపు పొందిన హుచ్చ వెంకట్‌ గతంలో కూడా అనేకసార్లు ఇలాగే ప్రవర్తించాడు. తాగిన మైకంలో ఓ బేకరీ దగ్గరకు వెళ్లి.. అక్కడ ఉన్నవాళ్లను కాళ్లతో తన్ని అలజడి సృష్టించాడు. బేకరి యజమానిపై కూడా దాడికి దిగాడు. బేకరి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుచ్చ వెంకట్‌ను హెచ్చరించి పంపివేశారు. అనంతరం వెంకట్‌ కనిపించకుండా పోయాడు. అదే విధంగా విధానసభ ఎన్నికల్లో బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ వార్తల్లో నిలిచాడు. అంతేగాకుండా దివ్య స్పందన అనే నటిని పెళ్లి పేరుతో వేధించినందుకు అతనిపై కేసు నమోదైంది. ఓ టెలివిజన్ డిబేట్‌లో గతంలో ఒక డైరెక్టర్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top