ఆ జాబితాలో నం.1గా హృతిక్‌ రోషన్‌

Hrithik Roshan Has Been Voted As Sexiest Asian Male Of The Decade In UK poll - Sakshi

‘ఏషియన్‌ సెక్సియెస్ట్‌ మేల్స్‌ 2019’ జాబితాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. బ్రిటిష్‌ ఈస్టర్న్‌ సంస్థ ఆన్‌లైన్‌ పోల్‌ ఆధారంగా బుధవారం లండన్‌లో విడుదల చేసిన ఈ జాబితాలో హృతిక్‌ మొదటి స్థానంలో నిలిచి ఆన్‌లైన్‌ గ్రీకువీరుడిగా అవతరించాడు. సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచి నెటిజన్లను ఆకర్షించే సెలబ్రిటీల గురించి చేపట్టిన ఓటింగ్‌ ఆధారంగా బ్రిటీష్‌ విక్లీ ఈస్టర్న్‌ ఐ సంస్థ వార్షిక ‘సెక్సియెస్ట్‌ ఏషియన్‌ మేల్‌’  జాబితాను తయారు చేసింది. దీంతో ఈ ఏడాది సూపర్‌ 30, వార్‌ చిత్రాలతో బాక్సాఫీస్‌ హిట్స్‌తో దూసుకుపోయిన ఈ 45 ఏళ్ల హీరో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు. అదేవిధంగా హృతిక్‌ గత పదేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తూ.. ఓవరాల్‌ ర్యాంకింగ్‌లో కూడా ఎప్పుడూ  అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నాడు.

ఈ విషయం గురించి హృతిక్‌ మాట్లాడుతూ.. ‘ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ నేను ఎప్పుడూ దీనిని పోటీగా చూడలేదు. నన్ను ఆకర్షణీయ వ్యక్తిగా గుర్తించి ఆన్‌లైన్‌లో నాకు ఓటువేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చాడు. ‘కేవలం ఓ వ్యక్తి రూపంతో మాత్రమే ఈ జాబితా రూపొందలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును మాత్రమే నేను తుది తీర్పుగా భావించడం లేదు’ అని హృతిక్‌ చెప్పాడు. అలాగే ఈస్టర్న్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎడిటర్‌, ఈ జాబితా రూపకర్త అజ్సాద్‌ నజీర్‌ మాట్లాడుతూ.. ఈ జాబితాను గత పదహారేళ్లుగా తయారు చేస్తున్నామని, అప్పటి నుంచి హీరో హృతిక్‌కు నెటిజన్లు ఎక్కువ ఓట్లు వేస్తున్నారని తెలిపాడు. గ్రీకు దేవుడిని తలపించేలా హృతిక్‌ దేహదారుడ్యం ఉండటం వల్లే  నెటిజన్లు ఎక్కువగా ఆయనకు ఆకర్షితులయ్యారని పేర్కొన్నాడు. అలాగే హృతిక్‌తో పాటు ఈ జాబితాలో షాహిద్‌ కపూర్‌ రెండవ స్థానంలో ఉండగా, టెలివిజన్‌ నటుడు వివియన్‌ మూడో స్థానం, బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌లు నాలుగవ స్థానంలో నిలవగా, బ్రిటిష్‌ పాప్‌ స్టార్‌ జయాన్‌ మాలిక్‌ 5వ స్థానంలో ఉన్నట్లు నజీర్‌ వెల్లడించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top