ఫస్ట్‌ చాయిస్‌ నేనే! | Hollywood actor Dwayne Johnson is anchor in this years Oscars | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ చాయిస్‌ నేనే!

Feb 10 2019 1:56 AM | Updated on Feb 10 2019 1:56 AM

Hollywood actor Dwayne Johnson is anchor in this years Oscars - Sakshi

ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుక యాంకర్‌ లేకుండానే సాగనుంది. అయితే ఈ ఏడాది ఆస్కార్స్‌లో యాంకర్‌గా మొదటి ఎంపిక నేనే అంటున్నారు హాలీవుడ్‌ యాక్టర్‌ డ్వేన్‌ జాన్సన్‌. కెవిన్‌ హార్ట్‌ తప్పుకోవడంతో కొత్త యాంకర్‌ను ఎంపిక చేయడం కుదరకపోవడంతో యాంకర్‌ లేకుండానే ఆవార్డ్స్‌ జరగనున్నాయి. ఈ విషయం గురించి డ్వేన్‌ జాన్సన్‌ మాట్లాడుతూ –  ‘‘ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డ్‌ను హోస్ట్‌ చేయడానికి అకాడమీ అవార్డ్‌ మొదట నన్నే సంప్రదించింది. చాలా సరదాగా సాయంత్రాన్ని హోస్ట్‌ చేద్దాం అని అనుకున్నాను కూడా. కానీ ‘జుమాంజీ’ సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌ కారణంగా హోస్ట్‌ చేయడం కుదర్లేదు. చూద్దాం. భవిష్యత్తులో హోస్ట్‌గా చేసే అవకాశం రాకపోదా?’’ అని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement