దెయ్యాన్ని ఒక్కసారైనా చూడాలనుంది: నటి

Heroine Trisha acts in Mohini movie - Sakshi

హీరోయిన్‌ త్రిష దెయ్యాన్ని ఒక్కసారైనా చూడాలని అంటోంది. దెయ్యాన్ని చూడటమేమిటి అని అనుకుంటున్నారా .. అసలు ఈ చెన్నై బ్యూటీ ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడూ ప్రత్యేకమే అనిపిస్తుంది. ఈమె ప్రేమ పెళ్లి వరకూ వచ్చి రద్దైనా నటిగా కెరీర్‌కు ఎలాంటి భంగం కలగలేదు. ఆ తరువాత చాలా పాపులర్‌ అయ్యింది త్రిష. ఇప్పటికి తమిళం, తెలుగు చిత్రాలలో అగ్రనాయికల్లో ఒకరిగా రాణిస్తోంది.  త్రిష నటిగా దశాబ్దంన్నర పూర్తి చేసుకుని అరుదైన రికార్డును సాధించింది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన భేటీలో హీరోయిన్‌గా పదేళ్లు తర్వాత కథానాయకి అంతస్తును అందుకున్నారు. ‘నేను 15 ఏళ్లుగా అగ్రనాయకిగా రాణిస్తున్నానని చెప్పింది.

అందాల పోటీల్లో గెలిచి  ఆ తరువాత ఒక నటికి స్నేహితురాలిగా సిల్వర్‌స్కీన్‌కు పరిచయం అయ్యాను. తమిళ, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోయిన్‌ల్లో ఒకరిగా వెలుగొంతున్నాను. ప్రస్తుతం నా చేతిలో ఏడు చిత్రాలున్నాయి. వాటిలో మూడు చిత్రాలు దెయ్యం ఇతి వృత్తంతో కూడినవి. మోహినీ చిత్రం పూర్తిగా దెయ్యం కథతో రూపోందింది. త్వరలో ఈ చిత్రం తెరపైకి రానుంది. నాకు యాక్షన్‌ కథా చిత్రాలంటే, దెయ్యం కథా చిత్రాల్లో నటించడమే ఇష్టం అని చెప్పింది. భయానక దెయ్యం కథా చిత్రాలలో నటించి ప్రేక్షకులను భయపెట్టాలని కోరుకుంటున్నారు.

దేవుడు ఉన్నది నిజం అయితే దెయ్యం కూడా ఉండవచ్చు. అయితే మనిషిని మించిన శక్తి ఉందని నేను నమ్ముతాను. దెయ్యాన్ని చూశామని చాలా మంది అంటుంటారు. నాకూ ఒకసారి దెయ్యాన్ని చూడాలని ఉంది. ఇతర హీరోయిన్లతో నటించడానకి నేనెప్పుడూ రెడీనే. ఒకరికి మించిన హీరోయిన్లతో కలిసి నటించడం సరికొత్త అనుభవంగానూ, పోటీగానూ ఉంటుంది అని త్రిష చెప్పుకొచ్చింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top