‘గ్లామర్‌ ఏ మాత్రం తగ్గదు’ | Heroine Asna Javeri Special Interview | Sakshi
Sakshi News home page

Nov 25 2018 9:55 AM | Updated on Nov 25 2018 9:55 AM

Heroine Asna Javeri Special Interview - Sakshi

సంతానంకు జంటగా, వల్లవనుక్కు పుల్లుం ఆయుధం, ఇనిమే ఇప్పడిదాన్‌ చిత్రాల్లో నటించి కోలీవుడ్‌లో పాపులర్‌ అయిన నటి ఆశ్నా జవేరి. గతంలో మోడలింగ్‌ రంగంలో దుమ్మురేపిన ఆశ్నాజవేరి 2014లో కోలీవుడ్‌కు పరిచయమైంది. తాజాగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేసింది చాలా తక్కువ సినిమాలే. అందుకు కారణం అవకాశాలు రాకపోవడమే. నాలుగేళ్లు దాటినా పెద్ద హీరోలతో రొమాన్స్‌ చేసే అవకాశం రాకపోవడం, స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ పొందలేకపోవడంతో ఇక లాభం లేదు అనుకుందో ఏమో అందాలారబోతకు గేట్లు తెరిచేసింది.

తాజాగా విమల్‌తో రొమాన్స్‌ చేస్తున్న ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రంలో గ్లామర్‌లో విచ్చలవిడిగా నటించేసిందట. ఈ విషయాన్ని ఆశ్నాజవేరినే చెప్పింది. తెలుగు చిత్రం గుంటూర్‌ టాకీస్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఇది. చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన ఈ బ్యూటీతో చిన్న భేటీ.

ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రంలో అందాలారబోతకు గేట్లు తెరిచేశారట?
ఈ చిత్రంలో తొలిసారిగా గ్రామీణ యువతిగా నటిస్తున్నాను. అవును ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం పూర్తిగా గ్లామరస్‌ కథా చిత్రం. ఇది తెలుగు చిత్రం గుంటూర్‌ టాకీస్‌కు రీమేక్‌. ఆ చిత్రం మాదిరిగానే ఇందులోనూ గ్లామర్‌ ఏమాత్రం తగ్గదు. ఇక కథ డిమాండ్‌ మేరకే నేనూ గ్లామరస్‌గా నటించాను. అయితే దీన్ని ఇరట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు చిత్రంతో పోల్చకూడదు.ఆ చిత్రాన్ని నేను చూడకపోయినా, కచ్చితంగా ఇది అలా ఉండదు. ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం రొమాంటిక్‌ కామెడీ కథా చిత్రంగా ఉంటుంది.

నటుడు విమల్‌కు జంటగా నటించడం గురించి?
విమల్‌కు జంటగా నటించడం చాలా సంతోషకరమైన అనుభవం. ఆయన జాలీ టైపే అయినా,  చాలా నిరాడంబరంగా ఉంటారు. విమల్‌తో మళ్లీ మళ్లీ నటించాలని కోరుకుంటున్నాను.

కోలీవుడ్‌లో మీ తొలి చిత్ర హీరో సంతానం గురించి?
సంతానం ద్వారానే నేను కోలీవుడ్‌లో పాపులర్‌ అయ్యాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ఆశ పడుతున్నాను. అదే విధంగా విజయ్, అజిత్, సూర్య ప్రముఖ హీరోల సరసన నటించాలని కోరుకుంటున్నాను.

ఎలాంటి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నారు?
నిజం చెప్పాలంటే నాకు పలాన పాత్రలో నటించాలని ఏమీ లేదు. కథకు, పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను మార్చుకుని నటిస్తాను.

తమిళం మినహా ఇతర భాషల్లో అవకాశాలేమైనా?
తెలుగులో ఒక చిత్రం చేస్తున్నాను. అయితే తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేయాలనుకుంటున్నాను. అందుకే ఇక్కడే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాను. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement