'వివాహిత నటుడితో సహజీవనం చేశా' | Heroine Andrea Got A Lucky Chance To Act With Actor Vijay In Lokesh Kanagaraj Film | Sakshi
Sakshi News home page

'వివాహిత నటుడితో సహజీవనం చేశా'

Oct 30 2019 10:40 AM | Updated on Oct 30 2019 12:04 PM

Heroine Andrea Got A Lucky Chance To Act With Actor Vijay In Lokesh Kanagaraj Film - Sakshi

చెన్నై : హీరోయిన్‌ ఆండ్రియాకు సూపర్‌ చాన్స్‌ వరించడంతో ఎగిరి గంతేస్తున్నారు. ఏకంగా ఇళయ దళపతి విజయ్‌తో కలిసి నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ అమ్మడు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఈ సుందరి మల్టీ టాలెంటెడ్‌ అన్న విషయం తెలిసిందే. ఆండ్రియాలో మంచి గాయనీ, రచయిత ఉన్నారు. ఈ అమ్మడు చివరిసారిగా 'వడచెన్నై' అనే చిత్రంలో కనిపించింది. ఇటీవలే ఆండ్రియా ఒక సంచలన విషయాన్ని మీడియాకు విడుదల చేసి వార్తల్లో నిలిచింది. ‘వివాహితుడైన ఒక నటుడిని నమ్మి ఆయనతో సహజీవనం చేశాను. నేను అతని చేతిలో శారీరకంగానూ, మానసికంగానూ చాలా వేధింపులకు గురయ్యాను’ అని పేర్కొన్నారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి ఆయుర్వేద చికిత్సను తీసుకొని మళ్లీ మామూలు వ్యక్తిని కాగలిగానని ఆండ్రియా తెలిపారు. అయితే ఈ మధ్యనే ఆండ్రియా ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో తనను వేధింపులకు గురి చేసిన వ్యక్తి పేరు, అతని వివరాలు పొందిపరిచినట్లు పేర్కొన్నారు. త్వరలోనే పుస్తకాన్ని బయటకు తీసుకురావాలనుకోగా, కొందరు బెదిరింపులకు పాల్పడినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఇలాంటి పరిస్థితుల్లో నటి ఆండ్రియాకు ఇళయ దళపతి విజయ్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. ఈ ఒత్తిడిలో నిజంగా ఇది ఆండ్రియాకు ఉపశమనం కలిగించే విషయమే. బిగిల్‌ సినిమాతో బ్లాక్‌బాస్టర్‌ అందుకున్నవిజయ్‌ 'మానగరం', 'ఖైదీ' చిత్రాల ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమయిన ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. మరో విశేషమేమిటంటే ఈ చిత్రంలో నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. హీరోయిన్‌గా మాళవిక మోహన్‌ను ఇప్పుటికే ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా మరో ముఖ్య పాత్రకు ఆండ్రియాను తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఈ చిత్రంతో ఆండ్రియా కోలీవుడ్‌లో మరోసారి చక్రం తిప్పుతుందేమో చూడాలి. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement