అప్పుడు బాబాయ్‌...మరి ఇప్పుడు ? | Hero Srikanth Acts In Ram Charan Boyapati New Movie | Sakshi
Sakshi News home page

May 4 2018 3:42 PM | Updated on May 4 2018 3:42 PM

Hero Srikanth Acts In Ram Charan Boyapati New Movie - Sakshi

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో శ్రీకాంత్‌ రామ్‌చరణ్‌కు బాబాయ్‌గా నటించాడు. మళ్లీ ఇప్పుడు బోయపాటి శ్రీను, రామ్‌చరణ్‌ సినిమాలో కూడా శ్రీకాంత్‌ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని ముఖ్య పాత్రకు ఎవరైతే బాగుంటుందని డైరెక్టర్‌ ఆలోచిస్తుండగా... చెర్రీనే శ్రీకాంత్‌ పేరును సూచించాడట. 

మరి ఆ కీలక పాత్రలో శ్రీకాంత్‌, చరణ్‌కు ఏం అవుతాడో...గతంలో బాబాయ్‌గా నటించాడు. ఇప్పుడు ఏ పాత్రలో నటిస్తున్నాడో తెలియాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌కు సంబంధించి రెండు షెడ్యుల్స్‌ను కంప్లీట్ చేశాడు బోయపాటి. చరణ్‌ కూడా రెండో షెడ్యుల్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ప్రతినాయకుడు వివిక్‌ ఒబేరాయ్‌,  చరణ్‌లపై వచ్చే యాక్షన్‌సీన్స్‌ను చిత్రీకరించారు. ఫ్యామిలీ, యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా కైరా అద్వానీ నటిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement