కృష్ణగాడి వీర ప్రేమగాథ! | Hero Nani Says 'Jai Balayya'!!! | Sakshi
Sakshi News home page

కృష్ణగాడి వీర ప్రేమగాథ!

Jan 6 2016 11:31 PM | Updated on Sep 3 2017 3:12 PM

కృష్ణగాడి వీర ప్రేమగాథ!

కృష్ణగాడి వీర ప్రేమగాథ!

ఎప్పుడు మొదలైందో తెలియదు.... ఎప్పుడు పూర్తయిందో తెలియదు.. ఎలాంటి హంగామా,

ఎప్పుడు మొదలైందో తెలియదు.... ఎప్పుడు పూర్తయిందో తెలియదు.. ఎలాంటి హంగామా, హడావిడీ లేకుండా నాని నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ కూల్‌గా పూర్తయిపోయింది. ‘భలే భలే మగాడివోయ్’లో మతిమరుపు ఉన్న యువకుడిగా నటించిన నాని, తాజా చిత్రంలో హీరో బాలకృష్ణ అభిమానిగా నటించారు. సినిమాలో నాని చేతి మీద ‘జై బాలయ్య’ అనే టాటూ కూడా ఉంటుంది.

అందుకే, ఈ చిత్రానికి ఏకంగా ‘జై బాలయ్య’ అని టైటిల్ పెట్టారని ఫిలిం నగర్‌లో ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ‘మహాలక్ష్మి పెళ్లికి దూరం 150 కిలోమీటర్లు’ అనే టైటిల్‌ని అనుకున్నారట. లెటెస్ట్‌గా మరో టైటిల్ వినిపిస్తోంది. ఈసారి ప్రచారంలో ఉన్న టైటిల్ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. మరి.. చిత్రబృందం చర్చల్లో ఈ టైటిల్స్ ఉన్నాయా? లేక ఎవరికి వాళ్లు ఊహించుకుని ప్రచారం చేస్తున్నారా? ఫైనల్‌గా ఈ సినిమాకి ఏ టైటిల్ పెడతారు? అనేది వేచి చూడాల్సిందే.

‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. తొలి కాపీని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఫ్యాన్సీ రేటు ఇచ్చి, కొనుక్కుందట. ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement