క్షమాపణ చెప్పిన హీరో | Sakshi
Sakshi News home page

క్షమాపణ చెప్పిన హీరో

Published Fri, Jan 27 2017 10:00 AM

క్షమాపణ చెప్పిన హీరో

ముంబై: డిజిలిత్ దోసాన్ జహ్‌ గురించి చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ హీరో హర్షవర్థన్ కపూర్‌ క్షమాపణ చెప్పాడు. తాను చేసిన వ్యాఖ్యలు డిజిలిత్ ను బాధ పెట్టివుంటే క్షమించాలని కోరాడు. ‘డిజిలిత్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నటనను అభిమానిస్తాను. నేనేదైనా తప్పుగా మాట్లాడివుంటే మన్నించాల’ని ట్వీట్‌ చేశాడు. డిజిలిత్ కు ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిల్మ్ ఫేర్‌ అవార్డు ఇవ్వడాన్ని అంతకుముందు హర్షవర్థన్ తప్పుబట్టాడు.

‘తొలి ఉత్తమ నటుడి అవార్డు కొత్తగా సినిమాలు చేసిన వారికి ఇస్తారు. వేరే భాషల్లో సినిమాలు చేసి హిందీలో మొదటి చిత్రంలో నటించిన వారిని డెబ్యూ అవార్డులకు ఎంపిక చేయడం శోచనీయం. వంద ఇంగ్లీషు సినిమాల్లో నటించినా హిందీలో తొలి చిత్రం చేస్తే నాకు డెబ్యూ కేటగిరిలో అవార్డులకు అర్హత ఉంటుంది. లియొనార్డో డికాప్రియో ఆస్కార్ అవార్డు అందుకున్నా.. బాలీవుడ్ లో సినిమా చేస్తే అతడికి కూడా డెబ్యూ పురస్కారం ఇస్తారేమోన’ని హర్షవర్థన్‌ వ్యంగంగా కామెంట్లు చేశాడు. అనిల్ కపూర్ తనయుడైన 26 ఏళ్ల హర్షవర్థన్ ‘మీర్జ్యా’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement