దారుణంగా అవమానించారు: హరితేజ

Hari Teja Gets Emotional And Video Goes Viral - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినిమా ఆర్టిస్టులను అవమానించడం తగదని, వారిపై ఇష్టమున్నట్లు నోరు పారేసుకుంటున్నారని టాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ ఫైనలిస్ట్‌ హరితేజ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ వీడియోలో వివరిస్తూ ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కేవలం డబ్బు కోసమే ఆర్టిస్టులు పని చేస్తానుకోవద్దని, చేసే పనిని 100 శాతం మనసుపెట్టి చేస్తామన్నారు హరితేజ. 100 రూపాయలు పెట్టి టికెట్‌ కొని సినిమా చూస్తే అందులో ఉన్న నటీనటులపై తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే హక్కు ఉండదన్నారు. 

ఇటీవల మహానటి మూవీ చూసేందుకు ఓ థియేటర్‌కు వెళ్లిన సందర్భంగా తనకు, తన కుటుంబానికి ఎదురైన చేదు అనుభవాన్ని హరితేజ షేర్‌ చేసుకున్నారు. ఎవరి పక్కన పడితే వారి పక్కన కూర్చోవడానికి మేం సినిమా ఆర్టిస్టులం కాదని ఓ మహిళ అన్న మాటలతో తనకు భరించలేనంత కోపం వచ్చిందని చెప్పారు. ఆర్టిస్టులకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top