వేసవిలో వెడ్డింగ్‌ | Happy Wedding First Look Release Date Locked | Sakshi
Sakshi News home page

వేసవిలో వెడ్డింగ్‌

Feb 14 2018 12:44 AM | Updated on Feb 14 2018 12:44 AM

Happy Wedding First Look Release Date Locked - Sakshi

సుమంత్‌ అశ్విన్, నిహారిక కొణిదెల

సుమంత్‌ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా రూపొందిన సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్‌’. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, పాకెట్‌ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాని వేసవికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పెళ్లి కుదిరిన రోజు నుంచి జరిగే వరకూ ఉన్న టైమ్‌లో రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని లక్ష్మణ్‌ చక్కగా తెరకెక్కించాడు.

ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం జరిగి ఉంటుంది. ఆయా పాత్రల్లో ప్రేక్షకులు తమని తాము చూసుకునేలా ఉంటుంది. సుమంత్‌ అశ్విన్, నిహారిక చక్కగా నటించారు. ‘ఫిదా’ ఫేమ్‌ శక్తికాంత్‌ కార్తీక్‌ మా సినిమాకి పాటలు అందించారు. త్వరలోనే టీజర్‌ని రిలీజ్‌ చేస్తాం. ఈ సమ్మర్‌కి చక్కని ఫ్యామిలీ అండ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా మా సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. నరేశ్, మురళీ శర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాల్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement