బాలీవుడ్ లో నాకు ఎదురేది!:సన్నీ లియోన్ | Happy to make a mark in Bollywood,says Sunny Leone | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ లో నాకు ఎదురేది!:సన్నీ లియోన్

Jun 5 2014 3:20 PM | Updated on Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ లో నాకు ఎదురేది!:సన్నీ లియోన్ - Sakshi

బాలీవుడ్ లో నాకు ఎదురేది!:సన్నీ లియోన్

ఈ జనరేషన్ మనసు దోచుకున్న శృంగార తార ‘సన్నీ లియోన్’. పలు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ‘జిస్మ్ 2’ ద్వారా హిందీ చిత్రరంగానికి పరిచయమయ్యారు.

ఈ జనరేషన్ మనసు దోచుకున్న శృంగార తార ‘సన్నీ లియోన్’. పలు నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ‘జిస్మ్ 2’ ద్వారా హిందీ చిత్రరంగానికి పరిచయమయ్యారు. ఆ చిత్రంలో ఈ హాట్ గాళ్ ఏమాత్రం వళ్లు దాచుకోకుండా నటించిన వైనం చాలామందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారులో సన్నీకి చాలా క్రేజ్ నెలకొంది. అసలు ఆమె హిందీ చిత్ర రంగంలో అడుగుపెట్టడానికి ఐదో సీజన్ లో జరిగిన బిగ్ బాస్ రియాల్టీ షోనే.  అలా జిస్మ్ 2లో అవకాశాన్ని చేజిక్కించుకున్న సన్నీ లియోన్ బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బి అవుతోంది.

 

షూటౌట్ ఎట్ వాడాల, జాక్ పాట్,  రాగిణి ఎంఎంఎస్2 చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో కనిపించిన సన్నీ.. బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో తాను చాలా ఆనందంగా ఉన్నానని తెలిపింది.  'నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నాకు బాలీవుడ్ లో ఒక మార్క్ గుర్తింపు వచ్చింది. ఇంకా మంచి పాత్రలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తా' అంటూ పేర్కొంది. ఇప్పటికి మూడు చిత్రాలు మాత్రమే నటించానని, ప్రస్తుతం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని తెలిపింది. అభిమానులు తన సినిమాలు చూసి ఎక్కువ ఎంజాయ్ చేయాలని సన్నీ తెలిపింది.  డ్యాన్స్, నటనా పరంగా ఇంకా కష్టపడి పని చేస్తే తన చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడమే ఖాయమని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement