పేరుతో పాటు డబ్బు కూడా... | hansika's chandrakala audio released | Sakshi
Sakshi News home page

పేరుతో పాటు డబ్బు కూడా...

Dec 15 2014 11:17 PM | Updated on Sep 2 2017 6:13 PM

పేరుతో పాటు డబ్బు కూడా...

పేరుతో పాటు డబ్బు కూడా...

నా జీవితంలోనే గొప్ప సంతోష క్షణాలివి. 1982లో నిర్మాతని అయ్యాను. ఎన్నో సినిమాలు నిర్మించాను. అవేవీ ఇవ్వని ఆనందాన్ని ‘చందమామ’

‘‘నా జీవితంలోనే గొప్ప సంతోష క్షణాలివి. 1982లో నిర్మాతని అయ్యాను. ఎన్నో సినిమాలు నిర్మించాను. అవేవీ ఇవ్వని ఆనందాన్ని ‘చందమామ’ సినిమా ఇచ్చింది. ఇప్పుడు చేస్తున్న ‘చంద్రకళ’ అంతకంటే మంచి పేరు తెస్తుందనీ, దాంతో పాటు డబ్బుని కూడా తెస్తుందని నా నమ్మకం’’ అని సి.కల్యాణ్ అన్నారు. హన్సిక ముఖ్య పాత్రధారిణిగా సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘అరన్మణై’. ఈ చిత్రం ‘చంద్రకళ’ పేరుతో ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్నారు సి.కల్యాణ్. శ్వేతలానా, వరుణ్‌తేజ, సి.వి.రావు నిర్మాతలు. కార్తీక్‌రాజా, భరద్వాజ్ కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని బి.గోపాల్ ఆవిష్కరించి, తొలి ప్రతిని నిర్మాతల్లో ఒకరైన వరుణ్‌తేజకి అందించారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడారు. అతిథులుగా విచ్చేసిన బి.గోపాల్, రామ్‌ప్రసాద్, కొడాలి వెంకటేశ్వరరావు, శంకర్‌గౌడ్, ముత్యాల రాందాస్, బి.ఏ.రాజు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement