నాలో జాన్వీని చూశారు | hansika talking about sridevi | Sakshi
Sakshi News home page

నాలో జాన్వీని చూశారు

Mar 1 2018 12:34 AM | Updated on Mar 1 2018 12:34 AM

hansika talking about sridevi - Sakshi

హన్సిక

‘ఇంగ్లిష్‌–వింగ్లిష్‌’తో కమ్‌బ్యాక్‌ తర్వాత శ్రీదేవి ‘పులి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీదేవి కూతురుగా నటించిన హన్సిక నిజంగా కూడా తనని ఓ కూతురిలానే చూశారని చెప్పారు. శ్రీదేవి గురించి మాట్లాడుతూ...

► నేనొక్కదాన్నే కాదు శ్రీదేవి మేడమ్‌ను చూసి చాలామంది ఇన్‌స్పైర్‌ అయ్యారు. తనొక లెజెండ్‌. ఇండియన్‌ సినిమాకి ఇదొక డార్క్‌ డే అనుకోవచ్చు. ఒక గొప్ప టాలెంటెడ్‌ యాక్టర్‌ను కోల్పోయింది. శ్రీదేవిగారితో యాక్ట్‌ చేసే అదృష్టం నాకు దక్కినందుకు చాలా గర్వంగా ఉంది.  శ్రీదేవిగారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడాన్ని చాలా ఎంజాయ్‌ చేశాను.

► తను చాలా కైండ్, పొలైట్, ఎప్పుడూ ఎంకరేజ్‌ చేస్తూ ఉంటారు. తనతో నేను మాట్లాడినప్పుడు ‘జాన్వీ, నేను ఇలానే మాట్లాడుకునేవాళ్లం, జాన్వీని నేను చాలా మిస్‌ అవుతున్నాను’ అనేవారు. మా ఇద్దరి స్టార్‌ సైన్స్‌ (రాశులు) ఒక్కటే. మేం బాగా కలిసిపోయాం.   అంత త్వరగా దేవుడు  శ్రీదేవిగారిని తీసుకువెళ్లిపోవటం అన్యాయం. శ్రీదేవిగారు ఎక్కడున్నా ఆవిడ ఆత్మ శాంతిస్తుందనే అనుకుంటున్నాను. ఇండియన్‌ సినిమా డెఫినెట్‌గా ఒక లెజెండ్‌ను మిస్‌ అవుతుంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement