'పద్మ అవార్డుల గురించి వివరించా' | Had to explain to my Hollywood colleagues what Padma awards are: Priyanka Chopra | Sakshi
Sakshi News home page

'పద్మ అవార్డుల గురించి వివరించా'

Apr 12 2016 8:26 PM | Updated on Sep 3 2017 9:47 PM

'పద్మ అవార్డుల గురించి వివరించా'

'పద్మ అవార్డుల గురించి వివరించా'

ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకోవడం పట్ల బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకోవడం పట్ల బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. పద్మ పురస్కారాల విశిష్టత గురించి తనతో పాటు హాలీవుడ్ లో నటించిన వారికి వివరించానని, తనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల వారెంతో ఆనందపడ్డారని తెలిపింది.

మంగళవారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రియాంక చోప్రా అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారతదేశం గురించి ప్రపంచం మూసధోరణితో ఆలోచిస్తోందని తెలిపింది. ఇండియా గురించి పూర్తిగా తెలిసినవారితోనే తాను ఎక్కువగా గడిపానని వెల్లడించింది. భారతీయత గురించి గర్వంగా చెప్పుకుంటానని, ఇండియా గురించి తెలుసుకోవాలనుకునేవారికి వివరిస్తానని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement