నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ | gowthami putra satakarni first look out | Sakshi
Sakshi News home page

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్

Jun 9 2016 4:22 PM | Updated on Aug 29 2018 1:59 PM

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ - Sakshi

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర' శాతకర్ణి సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర' శాతకర్ణి సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. శుక్రవారం(జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ పోస్టర్ విడుదల చేశారు. యుద్ధం నేపథ్యంలో రూపొందించిన ఈ పోస్టర్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంది. శాతకర్ణిగా బాలకృష్ణ వైవిధ్యమైన గెటప్ లో కనిపించాడు.

పోస్టర్ చిత్రయూనిట్ అందరి పేర్లకు 'పుత్ర' జోడించారు. బాలకృష్ణను 'బసవరామతారకపుత్ర'గా వర్ణించారు. దర్శకుడి పేరును అంజనా పుత్ర క్రిష్, నిర్మాతల పేర్లను కమలాపుత్ర రాజీవ్ రెడ్డి, సీతారామపుత్ర సాయిబాబా అని వేశారు. టెక్నియన్ల పేర్లకు కూడా 'పుత్ర' తగిలించారు.

'గౌతమిపుత్ర' శాతకర్ణి సినిమా మొదటి షెడ్యూల్ మొరాకోలో ఇటీవలే పూర్తయింది. హైదరాబాద్‌లో వేసిన భారీ యుద్ధ నౌక సెట్‌లో మలి షెడ్యూల్ చేయనున్నారు. ఈ నెలలోనే ఈ షెడ్యూల్ ఆరంభమవుతుంది. బాలకృష్ణ సరసన శ్రీయ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి, కెమేరా:  జ్ఞానశేఖర్, మాటలు: బుర్రా సాయి మాధవ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement