ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా..

ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా..


తెలుగు సినీరంగంలో రచయితలుగా సక్సెస్ సాధించి చాలామంది ఆ తర్వాత మెగాఫోన్ పట్టి విజయాలనందుకున్నారు. ఇప్పుడు అదే బాటలో నడవడానికి మరో స్టార్ రైటర్ రెడీ అవుతున్నాడు. శ్రీను వైట్ల, వినాయక్ లాంటి దర్శకుల సినిమాలకు రచయితగా పనిచేసిన గోపి మోహన్ త్వరలోనే దర్శకత్వం వహించనున్నాడు. రెండేళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రకటించాడు గోపి మోహన్. సునీల్ హీరోగా, అనీల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కే సినిమాతో గోపిమోహన్ దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.సునీల్తో చేయాల్సి సినిమా ఆలస్యం కావటం, ఈలోగా సునీల్ కూడా వీరు పోట్లతో మరో సినిమా అంగీకరించటంతో, ఇప్పుడు మరో సినిమాకు దర్శకత్వం వహించే ప్రయత్నాల్లో ఉన్నాడు గోపిమోహన్. ఈ సినిమాకు 'ఇష్టంగా.. సంతోషంగా.. ఆనందంగా' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫైనల్ చేశాడు. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రచయితగా భారీ విజయాలను అందించిన గోపిమోహన్ దర్శకుడిగా ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top