ఈ మధ్యకాలంలో శ్రీను వైట్లకు సరైన హిట్ అయితే లేదు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘విశ్వం’ (2024) బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో ఆయన కాస్త సమయం తీసుకొని.. ఇప్పుడు మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో శర్వా హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికీ శర్వాకి శ్రీను వైట్ల కథ వినిపించారట. శ్రీను వైట్ల మార్క్‌తో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా కథ శర్వానంద్‌కు నచ్చిందని సమాచారం. దీంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట శర్వా. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని భోగట్టా.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమా నిర్మించనున్నారని, త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్ టాక్. మరోవైపు ప్రస్తుతం ‘భోగి’, ‘బైకర్’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి రిలీజ్‌కు ముస్తాబవుతోంది.


