గూఢచారి దర్శకుడి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌

Goodachari Fame Sashi Kiran Tikka Next Project Update - Sakshi

అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గూఢచారి. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో శశికిరణ్  దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనూ ఘన విజయాన్ని అందుకున్న ఈ యువ దర్శకుడు తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను ఓ బిగ్‌ బ్యానర్‌లో చేయనున్నాడట. యంగ్‌ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో శశికిరణ్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు.

ఈ బ్యానర్‌లో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు వినాయక చవితి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతుండగా నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల (ఛలో ఫేం) దర్శకత్వంలో నాని హీరోగా  గౌతమ్‌ తిన్ననూరి(మళ్ళీరావా ఫేం) దర్శకత్వంలో సినిమాలు సెట్స్‌మీదకు రానున్నాయి. వీటితో పాటు శశికిరణ్ చిత్రానికి కూడా ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే శశికిరణ్ దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరనేది వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top