మంచినీ, చెడునూ చరిత్ర చెబుతుంది | Sakshi
Sakshi News home page

మంచినీ, చెడునూ చరిత్ర చెబుతుంది

Published Sat, Mar 15 2014 12:46 AM

మంచినీ, చెడునూ  చరిత్ర చెబుతుంది

 మంచి అయినా, చెడు అయినా చరిత్ర చెబుతుంది. సాధారణంగా మంచి కంటే చెడుకే ప్రచారం ఎక్కువ. దర్శకుడు శ్రీమహేశ్ చరిత్తిరం పేసు (చరిత్ర చెబుతుంది) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రంలో ఏ విషయం గురించి చరిత్ర చెబుతుందో ఆయన మాటల్లోనే చూద్దాం. తాను తన పని అంటూ జీవించే హీరోకు, తన స్నేహ బృందానికి ఒక సంఘటన ఆగ్రహాన్ని కలిగిస్తుంది.

ఆ సంఘటన ఏమిటి? వారి ఆగ్రహం ఎలాటి పరిణామాలకు దారి తీసింది? తదితర పలు ఆసక్తికరమైన అంశాల సమాహారమే చరిత్తిరం పేసు చిత్రం. ప్రేమ, హాస్యం, యాక్షన్ అంశాలమయంగా ఈ చిత్రం ఉంటుంది. అయ్యనార్ ఫిలింస్ పతాకంపై యోగేశ్వరన్ బోస్ నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పసంగ ఫేమ్ ధారణి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. డాక్టర్ శరవణన్, కృపా, కనిక, గంజా కరుప్పు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జగదీష్ విశ్వం చాయాగ్రహణాన్ని జయకుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement