ఈవీవీ సత్యనారాయణ సోదరుడు గిరి కన్నుమూత | evv giri passes away with jaundice | Sakshi
Sakshi News home page

ఈవీవీ సత్యనారాయణ సోదరుడు గిరి కన్నుమూత

Jan 21 2014 4:34 PM | Updated on Sep 2 2017 2:51 AM

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సోదరుడు ఈవీవీ గిరి (49) మంగళవారం హైదరాబాద్లో మరణించారు. ఆయన గత కొంత కాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు.

దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సోదరుడు ఈవీవీ గిరి (49) మంగళవారం హైదరాబాద్లో మరణించారు. ఆయన గత కొంత కాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకునిగా వ్యవహరించిన పలు చిత్రాలకు గిరి ఫొటోగ్రాఫర్గా పనిచేశారు. ఎల్లుండి.. గురువారం నాడు హైదరాబాద్లో ఈవీవీ గిరి అంత్యక్రియలు జరుగుతాయి.

ప్రముఖ హాస్య దర్శకుడైన ఈవీవీ సత్యనారాయణ పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ హీరోలుగా ఉన్న విషయం తెలిసిందే. సత్యనారాయణ కూడా అనారోగ్యంతో తక్కువ వయసులోనే మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన సోదరుడు కూడా చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించడం పట్ల సినీ ప్రముఖులు పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement