క్యాన్సర్‌ను జయించిన హీరో కొడుకు | Emraan Hashmi Sun Ayyan Now Well From Cancer | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ను జయించిన ఇమ్రాన్‌ హష్మి కుమారుడు

Jan 15 2019 10:39 AM | Updated on Jan 15 2019 11:10 AM

Emraan Hashmi Sun Ayyan Now Well From Cancer - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి సంక్రాంత్రి సందర్భంగా తన అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు. తన కుమారుడు అయాన్‌ క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తన కుమారుడితో దిగిన ఫోటోలను పోస్టు చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఇమ్రాన్‌ ధన్యవాదాలు తెలిపారు. అయాన్‌కు 2014లో క్యాన్సర్‌ సోకినట్లు వైద్యులు ధృవీకరించిన  విషయం తెలిసిందే.

ఐదేళ్ల పాటు నిరంతరాయంగా చికిత్స చేయించడంతో అయాన్‌ పూర్తిగా కోలుకున్నట్లు ఇమ్రాన్‌ తెలిపారు. అభిమానుల ప్రార్థనలతో తన కుమారుడు క్యాన్సర్‌ నుంచి విముక్తి పొందాడని ఆనందం వ్యక్తం చేశారు. కాగా బాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు ఇటీవల కాలంలో క్యాన్సర్‌ బారిన పడుతున్న విషయం తెలిసిందే.  సోనాలీ బింద్రే, ఇర్ఫాన్‌ ఖాన్‌లు కూడా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement