'నాకైతే ఇగో లేదు' | Ego doesn't exist for me, says Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

'నాకైతే ఇగో లేదు'

Jan 30 2015 5:34 PM | Updated on Sep 2 2017 8:32 PM

'నాకైతే ఇగో లేదు'

'నాకైతే ఇగో లేదు'

సెలిబ్రెటీ రేంజ్ కు వెళితే ఎవరికైనా కాస్తా కూస్తో ఇగో కూడా వస్తుంది. అయితే మన బిగ్ బీ అమితాబ్ బచ్చన్(72) కు అసలు ఇగోనే లేదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

దుబాయ్: సెలిబ్రెటీ రేంజ్ కు వెళితే ఎవరికైనా కాస్తా కూస్తో ఇగో కూడా ఉంటుంది. అయితే మన బిగ్ బి అమితాబ్ బచ్చన్(72) కు అసలు ఇగోనే లేదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. షమితాబ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా తన అధికారిక బ్లాగ్ లో అమితాబ్ తన అభిప్రాయాల్ని పంచుకున్నాడు. ఈ చిత్రంలో ధనుష్, అక్షర, అమితాబచ్చన్ లు ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

 

ఈ సందర్భంగా అమితాబ్ స్పందిస్తూ..  తన వృత్తిలో ఎప్పుడూ ఇగోను దరిచేరనీయలేదన్నాడు.  తనకు సొంత ప్రయోజనాలు, సొంత అభిప్రాయాల గురించి తెలియదన్నాడు. అసలు ఆ విషయాన్ని కొస్తే తన సొంత ప్రయోజనాలకు ఏనాడు పెద్ద పీట వేయలేదని అమితాబ్ స్పష్టం చేశాడు. మిగతా  వారికి ఇగో ఉందా?లేదా అనేది తనకు తెలియదన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement