దసరాకి అదుగో | Dussehra release for Ravi Babu's Adhugo | Sakshi
Sakshi News home page

దసరాకి అదుగో

Aug 20 2018 1:09 AM | Updated on Aug 20 2018 1:09 AM

Dussehra release for Ravi Babu's Adhugo - Sakshi

రవిబాబు, సురేశ్‌ బాబు

రవిబాబు నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో ఓ పందిపిల్ల కీలక పాత్రలో నటించడం విశేషం. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఏ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్‌ బ్యానర్‌లో రవిబాబు నిర్మించిన ఈ సినిమా దసరాకి రానుంది. రవిబాబు మాట్లాడుతూ– ‘‘కుటుంబ ప్రేక్షకులు, పిల్లలను బాగా ఆకట్టుకునే కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.  ఇండియన్‌ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తి స్థాయి లైవ్‌ యాక్షన్‌ 3డి యానిమేషన్‌ను చూపించబోతున్నాం.

అందరికీ కనెక్ట్‌ అయ్యే యూనిక్‌ కాన్సెప్ట్‌ కావడంతో అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల చేస్తున్నాం. తెలుగులో ‘అదుగో’ టైటిల్‌తో రిలీజ్‌ కానున్న ఈ సినిమా మిగిలిన భాషల్లో ‘బంటి’ పేరుతో విడుదలవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా సెలవుల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. అభిషేక్‌ వర్మ, నభా, ఉదయ్‌ భాస్కర్, ఆర్కే, వీరేందర్‌ చౌదరి నటించిన ఈ  చిత్రానికి సంగీతం: పశ్రాంత్‌ ఆర్‌. విహార్, కెమెరా: ఎన్‌.సుధాకర్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement