తక్కువగా మాత్రం చూసుకోను

Director Sukumar Launched Kannullo Nee Roopame Trailer - Sakshi

‘మీ అమ్మానాన్నలకంటే ఎక్కువగా చూసుకుంటానో లేదో తెలీదు కానీ.. తక్కువగా మాత్రం చూసుకోను’ అంటూ ప్రారంభమయ్యే ‘కన్నుల్లో నీ రూపమే’ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. నందు, తేజస్వీ ప్రకాశ్‌ జంటగా బిక్స్‌ ఇరుసడ్లను దర్శకునిగా పరిచయం చేస్తూ భాస్కర్‌ భాసాని నిర్మించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ రిలీజ్‌ చేశారు. అనంతరం బిక్స్‌ మాట్లాడుతూ– ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది.

యువతకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉన్నాయి. ‘రంగస్థలం’ మూవీ షూటింగ్‌ బిజీలో ఉన్నా మాకు టైమ్‌ కేటాయించి మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సుకుమార్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ట్రైలర్‌ చూసి మమ్మల్ని ఆశీర్వదించడం మా టీమ్‌కు మరింత ఆనందంగా ఉంది. సాకేత్‌ సంగీతం సినిమాకి ప్లస్‌. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్‌ కొమండూరి, కెమెరా: ఎన్‌.బి. విశ్వకాంత్, సుభాష్‌ దొంతి, పాటలు: అనంత శ్రీరామ్, శ్రీమణి, కాసర్ల శ్యామ్‌.

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top