సునీల్‌తో శంకర్ కొత్త చిత్రం! | Director Shankar in Sunil movie | Sakshi
Sakshi News home page

సునీల్‌తో శంకర్ కొత్త చిత్రం!

Apr 30 2016 10:50 PM | Updated on Sep 3 2017 11:07 PM

సునీల్‌తో శంకర్ కొత్త చిత్రం!

సునీల్‌తో శంకర్ కొత్త చిత్రం!

వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎన్.శంకర్ ‘జై బోలో తెలంగాణ’ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల నూతన తారలతో

 వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎన్.శంకర్ ‘జై బోలో తెలంగాణ’ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల నూతన తారలతో దర్శకునిగా తన తొమ్మిదో చిత్రాన్ని ప్రారంభించిన ఎన్.శంకర్ ఇప్పుడు  సునీల్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.   తొలిసారిగా తన బ్యానర్‌లో వేరే దర్శకునికి అవకాశం ఇచ్చారు. ‘దూకుడు’, ‘బాద్‌షా’, ‘ఆగడు’ చిత్రాలకు స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో  ప్రారంభం కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement