ఆరు భాషలలో అమీగ మ్యూజిక్‌ వీడియో | Sakshi
Sakshi News home page

ఆరు భాషలలో అమీగ మ్యూజిక్‌ వీడియో

Published Tue, Apr 9 2019 12:37 PM

Director Dr Anand Music Video Amiga - Sakshi

డాక్టర్ ఆనంద్ రచన, దర్శకత్వంలో స్కూల్స్‌, కాలేజ్‌లలో జరిగే ర్యాగింగ్ కథాంశంతో  రూపొందిన డాన్స్ మ్యూజికల్ వీడియో అమీగ. ఈ వీడియోతో అమెరికాలో డాన్స్ ప్రదర్షణలు చేసి ఎన్నో అవార్డ్ లు సొంతం చేసుకున్న త్రిశూల్ కలాపురం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. బిగ్ బాస్ ఫేం తారిక, మహర్షి, రాజా ది గ్రేట్ ఫేం హాసిని ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ వీడియోను యన్‌యస్ నాయక్ సమర్పణలో పద్మా కలాపురం నిర్మించారు.

ఆరు భాషల్లో రూపొందించిన ఈ వీడియోను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లో ఈ మ్యూజిక్‌ వీడియోకు మంచి రెస్సాన్స్‌ వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న బాల నటి హాసిని ఈ వీడియోలో కీలక పాత్రలో కనిపించారు.


అమీగ పాటను ప్రముఖ వర్ధమాన రచయిత శ్రీనివాస మౌళి  రచించగా,తెలుగులో ఇండియన్ ఐడల్ రేవంత్, ఇంగ్లీష్ లో స్వీకర్ అగస్తి పాడడం విశేషం. డాక్టర్ ఆనంద్ దర్శకత్వ రూపొందిన ఈ వీడియోకు కిరణ్ మాస్టర్ కొరియోగ్రఫి అందించారు. ఈ వీడియో ప్రముఖ మ్యూజిక్ సంస్థ లహరి మ్యూజిక్ ద్వారా విడుదలయింది.

వీడియో రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. త్రిశూల్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడని, అందమైన తారిక, హాసినిలు అదనపు ఆకర్షణగా ఈ పాటను గోవా, ఓక్రిడ్జ్ మరియు ఆంబిటస్ స్కూల్స్‌లో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి అమీగ టీం అందరిని ఆశీర్వదించాలని కోరారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement