అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి

Dhanush to star opposite Keerthy Suresh in the remake of Netrikann - Sakshi

మామగారు రజనీకాంత్‌ నటించిన చిత్రాల్లో అల్లుడు ధనుష్‌కి బాగా నచ్చిన చిత్రాలు ‘మాపిళ్లయ్‌’, ‘నెట్రిక్కన్‌’. వీటిలో ‘మాపిళ్లయ్‌’ రీమేక్‌లో నటించారు ధనుష్‌. ఇప్పుడు ‘నెట్రిక్కన్‌’ రీమేక్‌లో నటించాలనుకుంటున్నారని సమాచారం. ఇక్కడ విశేషం ఏంటంటే... 1981లో విడుదలైన ‘నెట్రిక్కన్‌’లో రజనీ సరసన ఓ కథానాయికగా కీర్తీ సురేష్‌ తల్లి మేనక నటించారు. ఆ సినిమాలో మేనక నటనకు మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ రీమేక్‌లో ధనుష్‌తో కీర్తీ జోడీ కట్టనున్నారని సమాచారం.

ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప్రారంభం అవుతుందట. ఎస్‌.పి. ముత్తురామన్‌ దర్శకత్వంలో కె. బాలచందర్‌ ‘నెట్రిక్కన్‌’ని నిర్మించారు. ఇప్పుడు ధనుష్‌ తన వండర్‌బార్‌ బేనర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట. దర్శకుడు ఇంకా ఖారారు కాలేదు. ‘నెట్రిక్కన్‌’ కథ విషయానికి వస్తే.. ఉమనైజర్‌ అయిన తండ్రి ప్రవర్తనను మార్చాలని తాపత్రయపడే కొడుకు కథ ఇది. తండ్రీకొడుకుల పాత్రలను రజనీయే చేశారు. సో.. రీమేక్‌లో ధనుష్‌ ఈ రెండు పాత్రలు చేస్తారని ఊహించవచ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top