ప్చ్‌! బ్యాడ్‌ లక్‌! | Dhanush and Amala paul in VIP -2 promotion program | Sakshi
Sakshi News home page

ప్చ్‌! బ్యాడ్‌ లక్‌!

Jun 12 2017 12:46 AM | Updated on Sep 5 2017 1:22 PM

ప్చ్‌! బ్యాడ్‌ లక్‌!

ప్చ్‌! బ్యాడ్‌ లక్‌!

ఆదివారం కోసం అందరూ ఎదురు చూస్తాం. ఎంజాయ్‌ చేయడం కోసం. కానీ, అమలాపాల్‌ ఓ సండే కోసం ఎదురు చూడ్డానికి ఇది కారణం కాదు.

ఆదివారం కోసం అందరూ ఎదురు చూస్తాం. ఎంజాయ్‌ చేయడం కోసం. కానీ, అమలాపాల్‌ ఓ సండే కోసం ఎదురు చూడ్డానికి ఇది కారణం కాదు. వేరే రీజన్‌ ఉంది. కొన్ని రోజుల క్రితం సింగర్‌ సుచిత్ర ట్విట్టర్‌ అకౌంట్‌లో సుచిలీక్స్‌ పేరుతో పలువురు సెలబ్రిటీల అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఇవి పెద్ద దుమారాన్నే రేకెత్తించాయి. అయితే, వీటికీ, మాకూ ఎలాంటి సంబంధం లేదని, సుచిత్ర ట్విట్టర్‌ అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని ఆమె భర్త కార్తీక్‌ పేర్కొన్నారు.

కాగా, ఇదే ట్విట్టర్‌లో ఓ ఆదివారం ధనుష్‌–అమలాపాల్‌కి సంబంధించిన వీడియో ప్రత్యక్షమవుతుందనే వార్త కనిపించింది. ధనుష్‌ సరసన నటిస్తున్న ‘వి.ఐ.పి–2’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న అమాలాపాల్‌ ఈ విషయంపై సెటైర్లు వేశారు. ‘‘ఒక ఆదివారం నాకు చెందిన ఓ వీడియో ఒకటి బయటకు రాబోతుందని ఎవరో చెబితే తెలిసింది. నేను కూడా ఆ వీడియోకోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశాను. కానీ ఆ అకౌంట్‌ ఆ ఆదివారమే క్లోజ్‌ అయిందని తెలిసింది. మై బ్యాడ్‌ లక్‌. ఆ వీడియోలో ఏముందో తెలుసుకోలేకపోయాను’’ అన్నారు అమలాపాల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement