దేవదాసు... త్రీడీలో బాసు! | Devadasu movie in 3D | Sakshi
Sakshi News home page

దేవదాసు... త్రీడీలో బాసు!

Jun 12 2017 1:00 AM | Updated on Sep 5 2017 1:22 PM

దేవదాసు...  త్రీడీలో బాసు!

దేవదాసు... త్రీడీలో బాసు!

మీరు చదివింది నిజమే! దేవదాసు త్రీడీలో తెరపైకి రానున్నాడు. కొత్తగా ఎవరూ త్రీడీలో సిన్మా తీయడం లేదు.

మీరు చదివింది నిజమే! దేవదాసు త్రీడీలో తెరపైకి రానున్నాడు. కొత్తగా ఎవరూ త్రీడీలో సిన్మా తీయడం లేదు. పాత సినిమాను త్రీడీలో రీ–రిలీజ్‌ చేయనున్నారు. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా చేసిన హిందీ ‘దేవదాస్‌’ను త్రీడీలో విడుదల చేయనున్నట్టు దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. యాక్చువల్లీ... ఏదైనా సినిమాను త్రీడీ ఫార్మట్‌లో రిలీజ్‌ చేయాలంటే షూటింగ్‌ అప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

కెమెరా యాంగిల్స్, డైమెన్షన్స్‌ అంటూ చాలా లెక్కలున్నాయి. దర్శకుడు భన్సాలీకి కూడా సేమ్‌ డౌట్‌ వచ్చిందట! అయితే... సిన్మాలో ప్రతి ఫ్రేమ్‌ త్రీడీలో కన్వర్ట్‌ చేయడానికి కరెక్ట్‌గా ఉందని కన్విన్స్‌ అయిన తర్వాత ఈ నిర్ణయానికి (త్రీడీ రిలీజ్‌) వచ్చారట. ఈ జూలై 12కు ‘దేవదాస్‌’ విడుదలై 15 ఏళ్లు అవుతోంది. మళ్లీ అదే తేదీకి త్రీడీ వెర్షన్‌ను విడుదల చేసే ఛాన్సుంది!! సాధారణంగా ఫాంటసీ ఫిల్మ్స్, గ్రాఫికల్‌ వండర్స్‌ త్రీడీలో ఎక్కువ విడుదలవుతుంటాయి. బహుశా... త్రీడీలో వస్తోన్న ఫస్ట్‌ రొమాంటిక్‌ ఫిల్మ్‌ దేవదాసే కావొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement