మీకు నా ఐడీ కావాలా : హీరోయిన్‌ | Deepika Padukone's Response On Asked for Her ID By Airport Security | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీకి తన ఐడీ చూపించిన దీపిక

Jun 24 2019 1:18 PM | Updated on Jun 24 2019 4:11 PM

Deepika Padukone's Response On Asked for Her ID By Airport Security - Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకోన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తండ్రి ప్రకాష్‌ పదుకోన్‌తో ముంబై ఏయిర్‌పోర్ట్‌కి వెళ్లిన దీపికాకు వింత పరిస్థితి ఎదురైంది. బాలీవుడ్‌లో అంతపెద్ద సెలబ్రిటీని ఎయిర్‌పోర్ట్‌​ భద్రతా సిబ్బంది ఐడీ కార్డ్‌ చూపించాలని అడగటం అందర్నీ ఆశ్యర్యపరిచింది. అయితే ఈ ఘటనలో దీపికా వ్యవహరించిన తీరుకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఎయిర్‌పోర్ట్‌ ఎంట్రీ వద్ద భద్రతా సిబ్బంది దీపికాను ఐడీ కార్డు చూపించాలని అడిగారు. దీనికి ఆమె ఏమాత్రం చిరాకుపడకుండా, సెలబ్రెటీ అని అహం చూపకుండా మీకు ‘నా ఐడీ కావాలా’? అని.. తన ఐడీ కార్డును చూపించిన విదానానికి సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో భద్రతా సిబ్బంది తన విధులను సరిగ్గా నిర్వర్తించినందుకు కూడా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మేఘనా గుల్జార్‌  దర్శకత్వంలోని చపాక్‌ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న దీపికా.. త్వరలో 83 సినిమాలో నటించబోతుంది. ఈ సినిమాలో ఆమె భర్త రణ్‌వీర్‌ సింగ్‌ జోడిగా నటిస్తున్నారు.  వివాహం తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించబోయే మొదటి సినిమా ఇదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement