కంగనా ఔట్‌.. దీపిక ఇన్‌

Deepika Padukone replace Kangana Ranaut in Anurag Basu new movie - Sakshi

ఒకరు చేయాల్సిన సినిమా మరొకరి దగ్గరకు వెళ్లడం ఇండస్ట్రీలో చాలా కామన్‌. ఆ పాత్ర మీద ఎవరి పేరు రాసుంటే వాళ్లకు వెళ్తుంది. లేటెస్ట్‌గా బాలీవుడ్‌లో కంగనా చేయాల్సిన ఓ సినిమాను దీపికా పదుకోన్‌ చేయబోతున్నారని టాక్‌. దర్శకుడు అనురాగ్‌ బసు, కంగనా రనౌత్‌ ‘ఇమిలీ’ సినిమా చేయాలి. డేట్స్‌ అడ్జెస్ట్‌ అవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ నుంచి కంగనా తప్పుకున్నారు. ఆమె స్థానంలో దీపికా అయితే బావుంటుందని అనురాగ్‌ బసు భావిస్తున్నారట.

ఈ సినిమాకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని తెలిసింది. ఈ చిత్రం నుంచి తప్పుకోవడం గురించి కంగనా మాట్లాడుతూ–  ‘‘ఇమిలీ’ సినిమాలో నా మెంటర్‌తో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం దొరికింది అనుకున్నాను. కానీ కుదరడం లేదు. డేట్స్‌ ఇష్యూ గురించి అనురాగ్‌గారితో మాట్లాడాను. ఆయన నా పరిస్థితి అర్థం చేసుకున్నారు’’ అన్నారు. ‘ఇమిలీ’ చిత్రాన్ని 2018 నవంబర్‌లో స్టార్ట్‌ చేయాలి. కంగన ‘మణికర్ణిక’ సినిమాతో, నేను మరో ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యాం. ప్రస్తుతం ‘పంగా’ సినిమా చేస్తోంది. మళ్లీ త్వరలోనే మేం కలసి సినిమా చేస్తాం’’ అన్నారు అనురాగ్‌ బసు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top