వండర్‌ ఉమెన్‌ | Deepika Padukone is India's Wonder Woman | Sakshi
Sakshi News home page

వండర్‌ ఉమెన్‌

May 26 2018 5:57 AM | Updated on May 26 2018 5:57 AM

Deepika Padukone is India's Wonder Woman - Sakshi

దీపికా పదుకోన్‌ ‘పద్మావతి’గా థియేటర్స్‌లోకి వచ్చి దాదాపు ఐదు నెలలు కంప్లీట్‌ అయ్యాయి. నెక్ట్స్‌ ఆమె చేయబోయే సినిమా ఏంటి? అనుకుంటున్న టైమ్‌లో విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో నటించనున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఇందులో హీరోగా నటించాల్సిన ఇర్ఫాన్‌ఖాన్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ సినిమాకు బ్రేక్‌ పడింది. దీంతో దీపికా నెక్ట్స్‌ సినిమాపై మళ్లీ డౌట్స్‌ మొదలయ్యాయి. అయితే.. ఇప్పుడు ఆమె సూపర్‌ హీరోస్‌ మాదిరి వండర్‌ ఉమెన్‌లా ఓ సినిమాలో నటించబోతున్నారని బీటౌన్‌ లేటెస్ట్‌ ఖబర్‌.

అంతేకాదు.. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టు పార్ట్స్‌గా రాబోతుందట. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళితే.. వండర్‌ ఉమెన్‌ బ్యాక్‌డ్రాప్‌తో బాలీవుడ్‌లో నటించబోయే తొలి హీరోయిన్‌ దీపికానే అవుతుందని టాక్‌. మరి.. వండర్‌ ఉమెన్‌లా దీపికా చేయబోయే వండర్స్‌ ఏంటో సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాలంటే మాత్రం చాలా టైమ్‌ ఉంది. ఇక.. రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోన్‌ ఈ ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement