జోడీ రిటర్న్‌ ్స | Deepika Padukone and Ranbir Kapoor collaborating for Anurag Basu | Sakshi
Sakshi News home page

జోడీ రిటర్న్‌ ్స

Apr 28 2019 2:08 AM | Updated on Apr 28 2019 2:08 AM

Deepika Padukone and Ranbir Kapoor collaborating for Anurag Basu - Sakshi

రణ్‌బీర్‌ కపూర్, దీపికా పదుకోన్‌

బాలీవుడ్‌ ఆన్‌స్క్రీన్‌ సూపర్‌హిట్‌ జోడీల్లో రణ్‌బీర్‌ కపూర్, దీపికా పదుకోన్‌ జంట ఒకటి. వీళ్లిద్దరూ కలిసి ‘హే జవానీ హై దివానీ, తమాషా’ సినిమాల్లో నటించారు. లేటెస్ట్‌గా మరోసారి స్క్రీన్‌పై కనిపించడానికి రెడీ అయ్యారని తెలిసింది. అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ సినిమా రూపొందనుందట. అందులో రణ్‌బీర్, దీపికాను లీడ్‌ పెయిర్‌గా ఎంపిక చేసుకున్నారట చిత్రబృందం. ఈ సినిమానే కాకుండా లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో రూపొందే సినిమాలోనూ రణ్‌బీర్, దీపికా జోడీగా నటిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి కన్‌ఫర్మ్‌ అయినా మళ్లీ ఈ జంటను స్క్రీన్‌పై చూడొచ్చు. రణ్‌బీర్‌ ప్రస్తుతం చేస్తున్న ఫ్యాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ 2019 క్రిస్మస్‌ సీజన్‌లో రిలీజ్‌ కావాలి. ప్రస్తుతం 2020 సమ్మర్‌లో రిలీజ్‌ కానుందని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement